సినిమా

Alias Rukmini: నాని, నితిన్‌లకి ఈ రుక్మిణి ఎంతో ప్రత్యేకం..

Alias Rukmini: నాని, నితిన్‌లకి లేటెస్ట్ సినిమా అలియాస్ రుక్మిణి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. గత కొంతకాలంగా నితిన్ కి ఆశించిన విజయాలు దక్కడం లేదు. అన్నీ జానర్స్ ట్రై చేస్తూ వస్తున్నాడు. కానీ, భీష్మ తర్వాత మళ్ళీ హిట్ చూడలేకపోయాడు. గత చిత్రం తమ్ముడు భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో, మళ్ళీ తనకి బాగా సూటయ్యే లవ్ స్టోరీని చేస్తున్నాడు.

ఆ సినిమానే అలియాస్ రుక్మిణి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే ప్రాజెక్ట్ మీద ఎప్పుడూ అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. ఈ సినిమాకి అలాగే మొదలయ్యాయి. నాని, ఇందులో భాగమవడంతో నితిన్ గత చిత్రాల ఫ్లాప్స్ విషయం కూడా పక్కనపెట్టారు. పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు, తగ్గట్టుగానే స్మూత్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

అలియాస్ రుక్మిణి చిత్రం డిసెంబర్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే రోజు అక్కినేని నాగ చైతన్య నటించిన వృష కర్మ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు వాయిదా పడే అవకాశాలున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే, నాని-నితిన్‌ల అలియాస్ రుక్మిణి చిత్రానికి సాలీడ్ డేట్ దొరికినట్టే. ఏమాత్రం టాక్ పాజిటివ్‌గా వచ్చినా సినిమా గ్యారెంటీగా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది.

ఆ ప్రయత్నాలే ఈ యంగ్ హీరోలు చేస్తున్నారు. తాజాగా, అలియాస్ రుక్మిణి సినిమాకి జామ్ పార్టీ పేరుతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో, భాగంగా నాని..నితిన్ నటించిన బంగారు బుల్లోడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసినట్టుగా చెప్పాడు. ఇప్పుడు నా సమర్పణలో సినిమా చేస్తున్నాడు. "నా ఆరంభంలో ఒక పేజీ నీది..నీ పునప్రారంభంలో ఒక పేజీ నాది"..అంటూ సరదా కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఇది జామ్ పార్టీ కాదు సక్సెస్ పార్టీ అని నాని అన్నాడు.

ఈ సందర్భంగా, నితిన్ కూడా.."నా కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమని..ఈ కథ అందరికీ నచ్చుతుంది".. అని నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. కాగా, ఈ సినిమాతో హీరోయిన్‌గా ఆఫియా సయ్యద్ పరిచయమవుతోంది. నాని సోదరి దీప్తి గంట నిర్మిస్తున్న మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్నాడు.

తర్వాత చదవండి