Allu Arjun: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీపిక పడుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా తర్వాత నుంచి అల్లు అర్జున్ చేయబోయో ప్రాజెక్ట్స్‌కి ఎక్కువ సమయం తీసుకోకూడదని డిసైడైనట్టుగా తెలుస్తోంది. అందుకే, 2027లో రెండు సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడట.
లోకేష్ కనగరాజ్‌తో భారీ యాక్షన్ మూవీ..
అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. వర్కింగ్ టైటిల్‌గా AA23గా పిలుస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ప్రారంభమవ్వాల్సి ఉంది.
కానీ, ఈ సినిమా కథ, ఫుల్ స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఆలస్యం అయింది. ప్రాజెక్ట్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి కూడా. లోకేష్-బన్నీ సినిమా క్యాన్సిల్ అయిందని ప్రచారం జరిగింది. కానీ, ప్రచారానికి చెక్ పెడుతూ చిత్రబృందం ఈ సినిమా ఉందని స్పష్టం చేసింది. తాజా, సమాచారం ప్రకారం లోకేష్-బన్నీ సినిమాను 2027 క్రిస్మస్ టార్గెట్‌గా విడుదల చేయాలని పక్కా ప్లాన్ చేస్తున్నారట. అయితే, విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
బాసిల్ జోసెఫ్‌తో మరో క్రేజీ కాంబినేషన్!
మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్స్ వర్క్ కూడా సైలెంట్‌గా జరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ ముంబైలో కలవడం, కథ గురించి చర్చలు జరపడం కూడా తెలిసిందే. 'మిన్నల్ మురళి' లాంటి సూపర్ హీరో మూవీతో బాసిల్ జోసెఫ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఇదే దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేస్తే అది ఎలాంటి జానర్లో అయి ఉంటుంది? సూపర్ హీరో కథనా..లేక యాక్షన్ ఎంటర్టైనరా లేదా కొత్త తరహా కథనా? అనే ఆసక్తి బన్నీ అభిమానుల్లో కలుగుతోంది. ఇక, ఈ రెండు సినిమాలను 2027లోనే పూర్తి చేసేలా ఇద్దరు దర్శకులకి బన్నీ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లో రూపొందనున్న AA23, AA24వ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రానున్నట్టు బన్నీ ప్లానింగ్‌తో అర్థమవుతోంది.
