సినిమా

Anil Ravipudi: ఎన్టీఆర్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తా..

Anil Ravipudi: ఎన్టీఆర్ సినిమాపై అనిల్ రావిపూడి తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్ళ నుంచి సీరియస్ రోల్స్ చేస్తున్న ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తా అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

Anil Ravipudi: ఎన్టీఆర్ సినిమాపై అనిల్ రావిపూడి తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదేళ్ళ నుంచి సీరియస్ రోల్స్ చేస్తున్న ఆయనతో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తా అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లో ఇప్పటి జనరేషన్ దర్శకుల్లో కామెడీని తనదైన స్టైల్‌లో పండిస్తూ వరుస విజయాలతో సత్తా చాటుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, తన చిత్రాల్లో వినోదానికి పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. అప్పట్లో, జంధ్యాల, ఆ తర్వాత ఈవీవీ ఇప్పుడు..అనిల్ రావుపూడి అనేట్టుగా తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన మార్క్‌ను ఏర్పరచుకున్నాడు.

ఇక, తాజాగా ఎన్టీఆర్‌తో సినిమా చేసే విషయంపై అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా చేయడం నాకు గొప్ప అవకాశమని అనిల్ రావిపూడి అన్నాన్నారు. దాదాపుగా, పదేళ్ల నుంచి ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయి కామెడీ పాత్రలో చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఏదైనా మ్యాజిక్ చేయాలని అనుకుంటున్నాను..అని అనిల్ తెలిపారు.

ఎన్టీఆర్ లోని కామెడీ టైమింగ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా మంచి సినిమా చేయాలన్నది రావిపూడి ఆలోచన అని ఆయన కామెంట్స్ బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘దేవర’, హిందీ డెబ్యూ మూవీ ‘వార్ 2’, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల్లో యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నారు తారక్. వీటికి భిన్నంగా మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

గతంలో ‘అదుర్స్’, ‘బాద్‌షా’, బృందావనం లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ కామెడీకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి అలాంటి కామెడీని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో కామెడి కథను సిద్ధం చేస్తున్నాడు. అలా, అని మొత్తం కామెడీగానే ఉండదట..ఫ్యామిలీ, ఎమోషన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించనున్నారు. ఇక, ఎన్టీఆర్ సోదరుడు, టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గెస్ట్ రోల్‌లో అలరించనున్నట్టుగా సమాచారం.

తర్వాత చదవండి