భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఇండియా ఏఐ మిషన్(IndiaAI Mission) కింద స్వదేశీంగా అభివృద్ధి చేసిన Chariot-1 ఫౌండేషన్ మోడల్స్‌ను ప్రారంభించారు. ఇందులో భారత్‌లోనే మొదటి నుంచి శిక్షణ ఇచ్చిన LLM (లార్జ్ లాంగ్వేజ్ మోడల్), TTS (టెక్స్ట్-టు-స్పీచ్) మోడల్స్ ఉన్నాయి. 11 బిలియన్ పారామీటర్ల LLMలో విభిన్న అవసరాలకు తగ్గట్టుగా వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ తమ మల్టీ-ఏజెంట్ కొలాబరేషన్ ప్లాట్‌ఫామ్ 'Claude Duet' AI ఏజెంట్‌ను భారత్‌లో విడుదల చేసింది. సంక్లిష్టమైన కోడింగ్ పనుల్లో రెండు AI ఏజెంట్లు కలిసి పనిచేసేలా దీన్ని రూపొందించారు. మరిన్ని టెక్ అప్ డేట్స్ మీకోసం...

ఐఐటీలలో 6,000 కొత్త సీట్లు:.. రోబోటిక్స్, ఫిజికల్ AI, స్పేస్ టెక్నాలజీపై ఫోకస్
2027 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో (IITs) రోబోటిక్స్, ఫిజికల్ AI, స్పేస్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కోర్సుల్లో సుమారు 6,000 అదనపు సీట్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో 5,000 సీట్లు రోబోటిక్స్, ఫిజికల్ AIకి (బీటెక్, మాస్టర్స్, పీహెచ్‌డీ స్థాయిల్లో), 1,000 సీట్లు స్పేస్ ఇంజనీరింగ్ & టెక్నాలజీకి కేటాయించారు.

Vivo X500 సిరీస్ భారత్ లాంచ్: 200MP ZEISS కెమెరా, భారీ బ్యాటరీ
వివో (Vivo) తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'Vivo X500'ను (X500, X500 Pro, X500 Pro Max) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో Pro Max మోడల్ 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా, 7,800mAh బ్యాటరీతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, సిరీస్‌లోని ఫోన్లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7పై పనిచేస్తాయి.

సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉచిత బస్సులు
హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 'సైబరాబాద్ మూవ్స్ 2026' సందర్భంగా నవంబర్ 26 నుంచి 28 వరకు సిటీఫ్లో (Cityflo) ఉచిత షటిల్ బస్సు సేవలను నడుపుతోంది. టీసీఎస్ కోహినూర్ పార్క్–టీ-హబ్, వేవ్‌రాక్–టీ-హబ్ మార్గాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి 20–30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో బ్యాంకింగ్ టెక్నాలజీ సంస్థ CredAble, AI ఆధారిత రెగ్యులేటరీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (Reql)లో 70 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.
