తెలంగాణ

Rains in AP & TG : తెలంగాణ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఏపీ,తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుందని, నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది.

ఏపీ,తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న రోజుల్లో వాతావరణం పూర్తిగా మారిపోతుందని, నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని ఐఎండీ తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

ఏపీలో భారీ వర్షాలు..

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు,మూడు రోజుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని హెచ్చరించింది.ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు..

ఇక తెలంగాణలోనూ వాతావరణం చల్లగా మారి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని, దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంత తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ కోతలు, రబీ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోఅకాల వర్షాలు కురిస్తే అన్నదాతలు నష్టపోక తప్పదు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, పత్తి, మిర్చి తదితర పంట ఉత్పత్తులకు నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకే రైతులు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, టార్పాలిన్ కవర్స్ కప్పాలని సూచించారు.

తర్వాత చదవండి