క్రీడలు

Vaibhav Sooryavanshi: 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్ -ఏ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. సంచలన బ్యాటింగ్ చేశాడు. యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.

Vaibhav Sooryavanshi: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ గ్రూప్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ లో భారత్-ఏ ఓపెనర్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. మరోసారి సంచలన బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఈ 15ఏళ్ల కుర్రాడు తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు.

విధ్వంసకర బ్యాటింగ్ చేసిన వైభవ్.. ఒకే మ్యాచ్‌లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ, 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదేశాడు. 14 సిక్సర్ల సాయంతో శతకం అందుకున్నాడు. వరల్డ్ లిస్ట్-ఏ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాసెస్ట్ సెంచరీ. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ప్లేయర్ మెక్ గుర్క్ (29 బంతుల్లో సెంచరీ) పేరిట ఉన్న రికార్డ్ ను వైభవ్ బ్రేక్ చేశాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వైభవ్ దూకుడుగా ఆడాడు. బంతి ఎక్కడ వేసినా బౌండరీ దాటించాడు. గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో మరో ఘనత కూడా సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. చివరకు 53 బంతుల్లో 204 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లతో వీరవిహారం చేశాడు.

సెమీఫైనల్ బెర్త్ కోసం కీలకమైన ఈ పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

తన సంచలన బ్యాటింగ్ తో లిస్ట్-ఏ క్రికెట్‌లో పలు రికార్డులను బద్దలుకొట్టాడు వైభవ్. ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌గర్క్ 29 బంతుల్లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును 28 బంతులతో బ్రేక్ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా బ్యాటర్ చాడ్ బౌస్ 103 బంతుల్లో నమోదు చేసిన ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును సైతం వైభవ్ బద్దలుకొట్టాడు. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ, 28 బంతుల్లో సెంచరీ, 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసిన వైభవ్.. 52 బంతుల్లో చారిత్రక డబుల్ సెంచరీ అందుకున్నాడు. వైభవ్ సునామీ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరో 214 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో యూఏఈపై విక్టరీ కొట్టింది.

తర్వాత చదవండి