తెలంగాణ

Tech updates nov 24: మోటోరోలా Edge 70 Neo భారత్‌లో విడుదల.. తాజా టెక్ అప్‌డేట్స్ (నవంబరు 24)

ఈరోజు (నవంబర్ 24) టెక్ వార్తలు చూస్తే.. 7,000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో మోటోరోలా Edge 70 Neo రూ.40,999 ధరకు భారత్‌లో విడుదల కాగా, నవంబర్ 26న Vivo X500 సిరీస్, డిసెంబర్‌లో Xiaomi 18 Pro, iQOO 16 వంటి ఫోన్లు రానున్నాయి.

 ఈరోజు (నవంబర్ 24) టెక్ వార్తలు చూస్తే.. 7,000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో మోటోరోలా Edge 70 Neo రూ.40,999 ధరకు భారత్‌లో విడుదల కాగా, నవంబర్ 26న Vivo X500 సిరీస్, డిసెంబర్‌లో Xiaomi 18 Pro, iQOO 16 వంటి ఫోన్లు రానున్నాయి. మరోవైపు టెలికాం స్టార్టప్‌లు, MSMEల కోసం ప్రత్యేక అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించగా, AI విస్తరణతో పాటు భారతీయ IT సేవలకు ఇంజనీరింగ్, ఇంటిగ్రేషన్ పరంగా డిమాండ్ కొనసాగుతుందని తాజా నివేదిక అంచనా వేసింది.

 'Motorola Edge 70 Neo' స్మార్ట్‌ఫోన్‌ లాంచ్

మోటోరోలా సంస్థ తమ 'Motorola Edge 70 Neo' స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.8 అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే (144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్), స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్నాయి. 7,000mAh బ్యాటరీతో పాటు 45W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 50MP సోనీ లైటియా 710 ప్రధాన కెమెరా (OIS), 2MP మాక్రో లెన్స్, ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UXపై పనిచేసే ఈ ఫోన్‌కు మూడు OS అప్‌గ్రేడ్‌లు లభిస్తాయి. దీని ధర రూ.40,999గా నిర్ణయించగా, డిసెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

 రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు: Vivo X500 సిరీస్, Xiaomi 18 Pro, iQOO 16

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రాబోయే వారాల్లో మరిన్ని కీలక మోడళ్లు సందడి చేయనున్నాయి. Vivo X500 సిరీస్ (X500, X500 Pro, X500 Pro Max) నవంబర్ 26న భారత్‌లో లాంచ్ కానుంది. మరోవైపు వెనుక సెకండరీ 2.7 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో Xiaomi 18 Pro, అలాగే iQOO 16 డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

 టెలికాం స్టార్టప్‌లు, MSMEల కోసం ప్రత్యేక అడ్వైజరీ గ్రూప్: సింధియా ప్రకటన

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'టెలికాం స్టార్టప్స్ అండ్ MSME కాన్‌క్లేవ్ 2026'లో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ప్రకటన చేశారు. టెలికాం స్టార్టప్‌లు, MSMEల సమస్యలను పరిష్కరించి, వాటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక అడ్వైజరీ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశం టెక్నాలజీ వినియోగదారు స్థాయి నుంచి తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని, డేటా ధరలు 2014తో పోలిస్తే గణనీయంగా తగ్గి ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

 AI విస్తరణతో భారతీయ IT సేవలకు డిమాండ్.. నివేదిక అంచనాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్నప్పటికీ, భారతీయ IT సేవల సంస్థలకు డిమాండ్ కొనసాగుతుందని సిస్టమాటిక్స్ (Systematix) నివేదిక వెల్లడించింది. సంస్థలు తమ వ్యాపారాల్లో AI సొల్యూషన్లను ఇంటిగ్రేట్ చేయడం, డేటా నిర్వహణ, స్కేలింగ్ కోసం నిపుణులైన ఇంజనీరింగ్, ఇంప్లిమెంటేషన్ మద్దతు అవసరమవుతుందని, అయితే సంప్రదాయ లేబర్-ఆధారిత మోడళ్లపై మాత్రం ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక విశ్లేషించింది.

తర్వాత చదవండి