తెలంగాణ

Dengue Alert: హడలెత్తిస్తున్న డెంగీ కేసులు.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ముప్పు!

మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య డెంగీ కేసులు హడలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇన్ఫ్లూయింజా టైప్ 'ఎ', 'బి' కేసులు వ్యాపిస్తున్న వేళ, కొందరిలో వీటితో పాటు డెంగీ కలిసి దాడి చేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ, ఇన్ఫ్లూయింజా లక్షణాలు దాదాపు ఒకేలా కనిపిస్తుండటంతో బాధితులు 48 నుంచి 72 గంటల పాటు ఆసుపత్రికి వెళ్లడంలో జాప్యం చేస్తున్నారు.

 మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య డెంగీ కేసులు హడలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇన్ఫ్లూయింజా టైప్ 'ఎ', 'బి' కేసులు వ్యాపిస్తున్న వేళ, కొందరిలో వీటితో పాటు డెంగీ కలిసి దాడి చేస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ, ఇన్ఫ్లూయింజా లక్షణాలు దాదాపు ఒకేలా కనిపిస్తుండటంతో బాధితులు 48 నుంచి 72 గంటల పాటు ఆసుపత్రికి వెళ్లడంలో జాప్యం చేస్తున్నారు. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోవడం, తీవ్రమైన నీరసం, రక్తస్రావం, శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రులకు చేరుతున్న కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 సాధారణ లక్షణాలకు భిన్నంగా..

ఈ సీజన్‌లో డెంగీ సాధారణ లక్షణాలకు భిన్నంగా 'ఎటిపికల్ డెంగీ' (Atypical Dengue) రూపంలో కనిపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. సాధారణంగా శీతాకాలంలో దోమల వ్యాప్తి తగ్గడంతో డెంగీ కేసులు తగ్గుముఖం పడతాయి. అయితే హైదరాబాద్‌లో చలి పెరుగుతున్నప్పటికీ కేసులు తగ్గడం లేదని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పాటు తేలికపాటి జ్వరం, దగ్గు, జలుబు, కడుపు నొప్పిని సాధారణ ఫ్లూగా భావించి ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి, నాలుగో రోజు తీవ్ర నీరసంతో వైద్యుడిని సంప్రదించగా ప్లేట్లెట్లు పడిపోయి డెంగీగా నిర్ధారణ అయింది.

 హైదరాబాద్‌లో 500వరకు డెంగీ కేసులు

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ కేసులు అడపాదడపా నమోదవుతున్నాయి. ఇలాంటి లక్షణాలతో నెలకు సుమారు 50మంది వరకు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరుతుండగా, ఇప్పటివరకు నగరంలో 500 వరకు కేసులు నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కచ్చితమైన గణాంకాలను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు లేకపోయినప్పటికీ తాగునీరు, మురుగునీటి లీకేజీలు, తెరిచి ఉన్న మురుగు కాలువల వల్ల దోమలు వృద్ధి చెందుతున్నాయి.

 డెంగీ టైప్ ఎ, బి లక్షలణాలు..

ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇన్ఫ్లూయింజా 'ఎ', 'బి' మధ్య తేడాలను గుర్తించడం కీలకమని వైద్యులు వివరిస్తున్నారు. ఇన్ఫ్లూయింజా టైప్ 'ఎ' సోకితే ఆకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, 2 నుంచి 3 వారాల పాటు పొడి దగ్గు వేధిస్తాయి. టైప్ 'బి' బారిన పడిన పిల్లల్లో తీవ్రమైన కాలు నొప్పి, వాంతులు, విరేచనాలు కనిపిస్తాయి. ఇంట్లో ఒకరికి వస్తే ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. సాధారణ చికిత్సతో ఇది 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ డెంగీ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి.

 పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల, డాబాపై ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, పగిలిన పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వాటర్ కూలర్లు, డ్రమ్ములు, పెంపుడు జంతువుల నీటి గిన్నెలను వారానికి ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి, లోపల రుద్ది కడగాలి. నీటి ట్యాంకులపై మూతలు బిగుతుగా ఉంచడంతో పాటు, పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు పొడవాటి చొక్కాలు, టీ షర్టులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తర్వాత చదవండి