Tollywood: టాలీవుడ్ అగ్ర నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చేతికి ‘జనవరి 12 విడుదల’ నైజాం హక్కులు దక్కాయి. దీంతో, 2027 సంక్రాంతి బరిలో మరోసారి అనిల్ రావిపూడి సినిమాతో హిట్ కొట్టే ప్లాన్ చేశాడు దిల్ రాజు. తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైందని అర్థమవుతోంది. అన్నిటికంటే ముందు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘జనవరి 12 విడుదల’ ప్రమోషన్స్ మొదలయ్యాయి.
టాలీవుడ్లో ఇప్పటికే పలు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జనవరి 12 విడుదల’ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి బాగా పెరిగింది. అయితే, తాజాగా ఈ మూవీ బిజినెస్‌కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
‘జనవరి 12 విడుదల’ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సొంతం దక్కించుకున్నాడు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసి) డిస్ట్రిబ్యూషన్ సంస్థ నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ప్రతీ సంక్రాంతి సీజన్లో అగ్ర హీరోల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో అపారమైన అనుభవం ఉన్న దిల్ రాజు.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’ లాంటి క్రేజీ మల్టీస్టారర్‌ను కూడా తన ఖాతాలో చేర్చుకున్నాడు.
అనిల్ రావిపూడితో దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్లో రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సాహు గారపాటి, డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. గ్యారెంటీగా ఈ సినిమాతో దిల్ రాజు మంచి లాభాలు అందుకుంటాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, కృతి శెట్టి నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.
