తెలంగాణ

Padi Kaushik Reddy: రాజీనామాకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్

లంగాణలో పెన్షన్లు తొలగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్త పెన్షన్ల సంగతి ఏమో కానీ.. ఉన్న పెన్షన్లను కూడా రేవంత్ సర్కార్ తొలగిస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో 1029 పెన్షన్లు తొలగించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా అనేకమందికి పెన్షన్లు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Padi Kaushik Reddy: తెలంగాణలో పెన్షన్లు తొలగిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్త పెన్షన్ల సంగతి ఏమో కానీ.. ఉన్న పెన్షన్లను కూడా రేవంత్ సర్కార్ తొలగిస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో 1029 పెన్షన్లు తొలగించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా అనేకమందికి పెన్షన్లు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

రాజీనామాకు నేను రెడీ.. మీరు సిద్ధమా?

తన నియోజకవర్గం హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. పైగా 1029 పెన్షన్లు తీసేశారని చెప్పారు. తాను గాలి మాటలు మాట్లాడటం లేదని, లెక్కలతో సహా చెబుతున్నానని వెల్లడించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్లు చూపించినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

సిద్ధిపేటలో పోటీ చేస్తే రేవంత్ కి డిపాజిట్ కూడా దక్కదు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో 5వేల 250 పెన్షన్లు తొలగించారని కౌశిక్ రెడ్డి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. తెలంగాణ తులసి వనంలో సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్క అని విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గం హుజూరాబాద్ లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. హరీశ్ రావుకి, రేవంత్ కి పోలికే లేదన్నారు. సిద్ధిపేటలో పోటీ చేస్తే రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.

కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు!

''సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల కంటే కొడంగల్ లో ఒక్క ఇంచు ఎక్కువ అభివృద్ధి చేసినా నా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెబుతా. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా పోతున్నాయి. సర్వే రిపోర్టుల్లో అదే తేలింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుస్తుందన్నది అనుమానమే. అందుకే రేవంత్ లో ఇంత అసహనం. మీరు ఇస్తా అన్నా 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? 420 హామీలు ఏమయ్యాయి? 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?'' అని సీఎం రేవంత్ ను నిలదీశారు పాడి కౌశిక్ రెడ్డి.

రూ.200ల నుంచి రూ.2వేలకు పెన్షన్ పెంచిన చరిత్ర కేసీఆర్‌ది

''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 200గా ఉన్న పెన్షన్‌ను.. తెలంగాణ వచ్చాక రూ.2వేలకు పెంచిన చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణ రాక ముందు దివ్యాంగులకు రూ.500గా ఉన్న పెన్షన్‌ను.. తెలంగాణ వచ్చాక రూ.4వేలకు పెంచిన ఘనత కేసీఆర్ ది. నా నియోజకవర్గంలో దాదాపు 45వేల పెన్షన్లు కేసీఆర్ ఇచ్చారు. అందులోంచి వెయ్యి పెన్షన్లను రేవంత్ తీసేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు 45లక్షలు. రేవంత్ రెడ్డి కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2వేల పెన్షన్‌ను రూ.4వేలకు, రూ.4వేల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ నేడు కేసీఆర్ హయాంలో పేదలకు అందుతున్న పెన్షన్లను తొలగిస్తూ, కొత్తగా పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రచారం చేయడం ఎంతవరకు న్యాయం?'' అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి.

తర్వాత చదవండి