సినిమా

Tollywood: కూతురు పుట్టినరోజు.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

Tollywood: కూతురు పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా, ఖచ్చితంగా ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత అందరినీ అబ్బురపరుస్తుంది. ఒక్కోసారి సినిమా అప్‌డేట్స్ కంటే తన భార్య స్నేహ..పిల్లల గురించి అభిమానులతో పంచుకునే విషయాలే ఎంతో ఆనందంగా అనిపిస్తుంటాయి.

ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. వాటితోనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా, పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో ప్రత్యేకంగా చూసే బన్నీ.. తాజాగా తన ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా, సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ అందరిని ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఇక, తన కూతురిపై ఉన్న ప్రేమను తెలుపుతూ, బన్నీ చేసిన ఈ పోస్ట్ అభిమానులను కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది. పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన కుటుంబానికి సమయం కేటాయించడం అల్లు అర్జున్ ప్రత్యేకత. ఇటు అల్లు ఫ్యామిలీలో గానీ, అటు మెగా ఫ్యామిలీలో గాని ఎలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా..ఫంక్షన్స్ ఉన్నా ఖచ్చితంగా సందడి చేస్తాడు. అది, కూడా సకుటంబ సమేతంగా.

పదేళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్హ..

ఈ నవంబర్ 21న అల్లు అర్హ 10వదో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ తన కూతురితో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. “Happy birthday to the Joy of My Life” అంటూ ప్రేమతో ఉన్న క్యాప్షన్ ను జత చేశాడు. ఇంత చిన్న మెసేజ్‌లోనే బన్నీకి తన కూతురిపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తపరచడం..అందరికీ ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్రస్తుతం, ఈ పోస్ట్ సోషల్ మీడ్యాలో బాగా వైరల్ అవుతోంది.

తర్వాత చదవండి