తెలంగాణ

CM RevanthReddy: తన పాలనకు రేవంత్ రెడ్డి ఎన్ని మార్కులు వేసుకున్నారంటే?

తెలంగాణ రాజకీయ సమీకరణాలు, తమ ప్రభుత్వ పరిపాలనా తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ (BRS) మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు.

 తెలంగాణ రాజకీయ సమీకరణాలు, తమ ప్రభుత్వ పరిపాలనా తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ (BRS) మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ రాష్ట్రంలో ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి విశ్లేషించారు.

 జాతీయ స్థాయిలో విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడటం లేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పరిమితంగానే ఉందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన పునాది లేదని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా సిరిసిల్ల, సిద్దిపేట వంటి బీఆర్ఎస్ కంచుకోటల్లో పర్యటిస్తూ ప్రధాన ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు ఎక్కుపెడుతున్న ముఖ్యమంత్రి, తాజా ఇంటర్వ్యూలోనూ బీఆర్ఎస్ లక్ష్యంగానే తమ వ్యూహాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు.

 ఇదే సందర్భంలో తమ ప్రభుత్వ పనితీరుపై స్పందించిన రేవంత్ రెడ్డి, తన పరిపాలనకు తానే 10కి 6.5 మార్కులు వేసుకుంటానని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తాము సరైన దిశలోనే వెళ్తున్నామని, అయితే చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పరిపాలనలో మరింత వేగం పెంచి ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 తెలంగాణకు త్వరలో మరో ఫుట్ బాల్ దిగ్గజం

క్రీడా రంగ అభివృద్ధి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపుపైనా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను త్వరలోనే తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల రాకతో రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు మరింత గుర్తింపు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

తర్వాత చదవండి