Sreeleela: రజినీ సినిమాతో నా కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది మన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగు సినిమాలలో నటన, డాన్స్ పరంగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ముఖ్యంగా, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రజినీ నటిస్తున్న ధర్మన్ సినిమాలో శ్రీలీల కీలక పాత్రను పోషిస్తోంది.
అయితే, తాజాగా రజినీ ధర్మన్ సినిమా గురించి మాట్లాడిన శ్రీలీల.. ఆయనతో కలిసి పనిచేయడం తన కల నెరవేరినట్లుగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం, రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ధర్మన్’ మూవీలో శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నా కెరీర్లో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న వాళ్ళు ధర్మన్ సినిమాలో ఉన్నారు. అందుకే, ఈ ప్రాజెక్టును ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాను..అని శ్రీలీల తెలిపింది.
ముఖ్యంగా, రజినీకాంత్‌కు నేను వీరాభిమానిని, అని కూడా చెప్పిన శ్రీలీల.. ఆయనతో కలిసి నటించడం గూస్బంప్స్ తెప్పిస్తోందని ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం, శ్రీలీల ఎంతో ఆనందంతో చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ, మన టాలీవుడ్ స్టార్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, రాశీఖన్నా నటిస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద విశ్వనటుడు కమల్ హాసన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, త్వరలో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2027, సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు..ఆ విషయాన్ని కూడా టీజర్లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓం సినిమాలో శ్రీలీల ధనుష్-మమ్ముట్టి-సాయి పల్లవిలతో కలిసి నటించింది. ఈ సినిమా చూసేందుకు వచ్చిన సమయంలోనే ధర్మన్ సినిమా గురించి చెప్పుకొచ్చింది.
