సినిమా

Sampath Nandi: రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ లతో 'భోగి'ని చూడొద్దు..

Sampath Nandi: మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది. రామ్మ్ చరణ్ హీరోగా 'రచ్చ', రవితేజతో 'బెంగాల్ టైగర్', గోపీచంద్‌తో 'గౌతమ్ నందా', 'సీటీమార్' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే, చాలా కాలం తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'భోగి'. గత చిత్రాలతో పోల్చి ఈ చిత్రాన్ని చూడొద్దంటున్నాడు సంపత్ నంది.

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నవంబర్ 27న భోగి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంపత్ నంది చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అలాగే, ప్రమోషనల్ ఇంటర్వ్య్యులోనూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా, ప్రేక్షకులకు ఆయన చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన గత చిత్రాలైన 'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'సీటీమార్' చిత్రాలను దృష్టిలో పెట్టుకుని 'భోగి' సినిమాను చూడొద్దని ఆయన కోరారు. ప్రస్తుతం, దర్శకులకు వారి గత చిత్రాలతో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతోందని సంపత్ నంది అన్నాడు. ఆదిత్య ధర్, లోకేష్ కనగరాజ్ సినిమాలను ప్రేక్షకులు ఎలా ప్రత్యేకమైన అంచనాలతో చూస్తారో.. తన సినిమాల విషయంలోనూ అలాంటి అభిప్రాయం ఉందని అన్నాడు.

కానీ, 'భోగి' సినిమాని మాత్రం "సంపత్ నంది సినిమా" అనే ముద్రతో కాకుండా, ఒక కొత్త దర్శకుడు రూపొందించిన సినిమాలా చూడాలన్నాడు. ఇక, ఈ కథ కోసం దాదాపుగా మూడేళ్ళు ఎంతో కష్టపడ్డాను. రోజుకు 14 నుంచి 16 గంటల వరకు పనిచేశానని వెల్లడించారు. తెలంగాణలోని బొగ్గులకుంట నేపథ్యంలో సాగే భోగి కథలో బానిసత్వం, కొన్ని పాత నమ్మకాలను ఎదిరించే బలమైన అంశాలు ఉంటాయని సంపత్ నంది తెలిపారు.

కాగా, ఈ మూవీలో శర్వానంద్ నటనపై సంపత్ నంది ప్రశంసల వర్షం కురిపించాశు. ముఖ్యంగా, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల్లో శర్వా అద్భుతంగా నటించాడని చెప్పాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఖచ్చితంగా ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు రావాలని అన్నాడు. ఇక, హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతమందించాడు.

తర్వాత చదవండి