Nagarjuna: కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్ 100. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ ఉప్డేట్ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఆశించిన విధంగా అప్డేట్స్ రాకపోవడంతో క్రిస్మస్ బరి నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. దీనికి, మేకర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ కింగ్ 100 సినిమా నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్ను వదిలారు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున తన 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టబు హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే, నాగ్-టబుల లుక్స్ వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాయి. దర్శకుడికిది రెండవ సినిమా అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో నాగార్జున సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.
అందుకే, నాగార్జున కూడా బయట నిర్మాణ సంస్థలో కాకుండా తన సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తున్నాడు. అయితే, ముందు నుంచి నాగ్ పెద్దగా ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఇవ్వడం లేదు. కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తపడుతున్నాడు. కానీ, దీన్ని నెటిజన్స్ ఇంకోలా అర్థం చేసుకున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో మేకర్స్ ప్రకటించిన డిసెంబర్ 24న కింగ్ 100 రావడం కష్టమని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.
ఇవి, వారి వరకూ చేరడంతో స్వయంగా వారే స్పందించారు. సరిగ్గా ఈరోజు నుంచి 30 రోజుల్లో కింగ్ రాబోతున్నాడంటూ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఇప్పటి వరకూ వస్తున్న ఈ సినిమా వాయిదా వార్తలకి చెక్ పెట్టినట్టైంది. ఇక, ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక్కడ, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న దాదా కూడా రిలీజ్ కాబోతోంది.
