సినిమా

Manchu Manoj: దాదా షూట్‌లో మనోజ్‌కి గాయం!

Manchu Manoj: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దాదా. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత తెలుగులో భగవంత్ కేసరిలో బాలయ్య సరసన నటించిన కాజల్ మరోసారి దాదాలోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్‌కి షూటింగ్‌లో గాయం అయినట్టుగా సమాచారం.

మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేకర్స్ వదిలిన ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక, దాదా సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారు.

అయితే, వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా.. మధ్యలో బాలయ్యకి గాయం కావడంతో కొన్నాళ్ళు చిత్రీకరణ వాయిదా పడింది. బాలయ్య లేని సన్నివేశాలను మాత్రం పూర్తి చేశారు. ఇక, ఈ సినిమా ఆలస్యం కాకూడదు అని బాలయ్యకి పూర్తిగా నయమవకుండానే మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టి షూట్ పూర్తి చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదా సినిమాలో బాలయ్యకి విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మొదలు పెట్టిన క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో మనోజ్ కి కూడా గాయం అయినట్టు తెలుస్తుంది. కానీ, చిత్రీకరణ మాత్రం ఆగలేదట. మనోజ్ కి గాయం అయినప్పటికీ, ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా సినిమా అనుకున్న సమయానికి పూర్తి కావాలని షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇలా హీరో, విలన్ ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా సినిమా కోసం శ్రమిస్తుండటం గొప్ప విషయమే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.

తర్వాత చదవండి