Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో, చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘భోగి’. ఇప్పటికే, వరుస అప్‌డేట్స్ వచ్చి ఆసక్తిని పెంచుతున్న క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. భోగి నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలను పెంచగా.. ఇప్పుడు ‘గంగ థీమ్’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటతో భోగి మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు మరింతగా పెరిగింది. యాక్షన్ సినిమాల దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. ఈ నేపథ్యంలో తాజాగా వదిలిన గంగ థీమ్ సాంగ్ శర్వా పాత్ర తీరును, సినిమాలోని మాస్ ఎలిమెంట్స్‌ను ప్రతిబింబించేలా హై ఓల్టేజ్‌లో ఉంది.
ఇక, ఈ పాటకు ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. నల్గొండ గద్దర్ నరసన్న అద్భుతమైన గొంతుతో ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా, ఈ పాటలోని జానపద రిథమ్స్, మాస్ బీట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా అనిపిస్తున్నాయి. అంతేకాదు, హైదరాబాద్‌కు చెందినటువంటి ఎత్నిక్ ట్రూప్ లైవ్ రిథమ్స్ కూడా ‘గంగ థీమ్’ కి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఎగిలివారంగా’, ‘అన్నయ్య పానంలో పూసిన పువ్వులు’ పాటలు సినీ పవర్స్‌ను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, రెండవ పాటలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని హృద్యంగా చూపించారు. ఇప్పుడు వచ్చిన గంగ థీమ్‌తో సినిమాలోని హీరో పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
ఇక, ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది వరుగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న శర్వాకి ఇది హ్యాట్రిక్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడు.
