సినిమా

Dhanush: ముఖ్యమంత్రి విజయ్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓం’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ప్రత్యేకమైన ప్రకటనను విడుదల చేశారు. ఈ నవంబర్ 20వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఓం’ చిత్రానికి ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ సందర్భంగా హీరో ధనుష్ తమిళనాడు ప్రభుత్వానికి అలాగే, ముఖ్యమంత్రి విజయ్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..అంటూ తెలిపాడు.

‘ఓం’ సినిమాలో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల లాంటి స్టార్స్‌తో పాటు ఇంకా ఎందరో ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్ల సమిష్టి కృషితో ఈ సినిమా రూపొందిందని గుర్తుచేస్తూ, అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడటమే చిత్ర పరిశ్రమకు అందించే అతిపెద్ద ప్రోత్సాహమని ఈ సందర్భంగా హీరో ధనుష్ పేర్కొన్నాడు. ముఖ్యంగా, ఉదయం 6 గంటల షోకు వచ్చే అభిమానులకు కూడా ధనుష్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు.

‘ఓం’ సినిమాను చూడటానికి, థియేటర్ల వద్దకు వచ్చే అభిమానులు సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మీతోటి ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన కోరాడు.

ఇక ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు. ఇప్పటికే, ‘ఓం’ సినిమాపై ప్రమోషనల్ కంటెంట్ఓ భారీగా అంచనాలు పెరిగాయి. శ్రీలీల, సాయి పల్లవిల పాత్రలు సినిమాకి మెయిన్ హైలెట్‌గా నిలవనున్నాయి. ఈ మధ్యనే, సాయి పల్లవి బాలీవుడ్ సినిమా రామాయణతో మంచి విజయాన్ని అందుకుంది. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలో సాయి పల్లవి భాగమవడం గొప్ప విషయం.

రామాయణ సినిమాలో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి, ‘ఓం’ సినిమాలో పూర్తి భిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతోంది. ఇక, గత కొంతకాలంగా శ్రీలీలకి ఏ భాషలోనూ ఆశించిన విజయం దక్కలేదు. ఇప్పుడు, ‘ఓం’ సినిమాలో తను కూడా భాగవమవడం ఆసక్తికరమైన విషయం. ఈ సినిమాతో గ్యారెంటీగా భారీ హిట్ దక్కుతుందని అందరూ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఒకవైపు, దుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార విడుదలవుతోంది. చూడాలి, మరి ‘ఓం’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో.

తర్వాత చదవండి