సినిమా

Sreeleela: చదువు కోసమే తెలుగు సినిమాలకి బ్రేక్..

Sreeleela: టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తారా జువ్వలా ఎగిసిపడిన ఈ బ్యూటీ అలా వచ్చి ఇలా వెళ్ళినట్టుగా అనిపించింది. తెలుగులో కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో, కొత్త సినిమాలేవి కమిటవలేదు. తాజాగా, దీనికి కారణం చదువే తప్ప ఫ్లాప్స్ కాదని క్లారిటీ ఇచ్చింది శ్రీలీల.

తెలుగులో, శ్రీలీల చెప్పుకునే భారీ హిట్ అంటే ఒక్క ధమాక సినిమా మాత్రమే. మిగతావన్నీ, యావరేజ్..ఫ్లాప్స్‌గా మిగిలినవే. ఈ కారణం వల్లే తెలుగులో శ్రీలీలకి హీరోయిన్ ఛాన్సులు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అదే, సమయంలో హిందీ, తమిళ సినిమాలకి సైన్ చేయడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. హిందీలో, ఇప్పటికే..రెండు సినిమాలను కమిటైంది. ఇంకా, ఈ సినిమాలకి టైటిల్స్ ప్రకటించలేదు.

ఇక, తమిళంలో రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ సినిమాలో నటిస్తోంది. అలాగే, ధనుష్-మమ్ముట్టి-సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఓం సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా, ఈ సినిమా ఈవెంట్‌లో తెలుగు సినిమాలకి బ్రేక్ ఎందుకిచ్చిందో వెల్లడించింది. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ముంబైలోని డి.వై.పాటిల్ యూనివర్సిటీలో మెడికల్ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేస్తుందట. అందుకే, కొత్త సినిమాలకి సైన్ చేయలేదని తెలిపింది.

కానీ, తమిళ-హిందీ సినిమాలను ఎలా ఒప్పుకుందీ..అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే, సన్నిహిత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏమిటంటే..ఇవన్నీ, ఇంతకముందే సైన్ చేసిన సినిమాలు. కాబట్టి, వాటిని వదులుకోలేక డేట్స్ ఇవ్వడం వల్లే, ఆ సినిమాలను పూర్తి చేసిందట. అలా, అనుకుంటే, ఇప్పుడు రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్ సినిమా కొత్త ప్రాజెక్టే. మరి, ఇదెలా సైన్ చేసిందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఏదేమైనా, తన చదువు పూర్తైయ్యాక మళ్ళీ తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ కమిటవుతుంది. మరి, మేకర్స్..ఫ్లాప్స్‌ను పట్టించుకోకుండా కొత్త సినిమాలకి అప్రోచ్ అవుతారో లేదో చూడాలి.

తర్వాత చదవండి