సినిమా

Director Bobby: పొంగల్‌కి "కాకా" వచ్చేది కన్‌ఫర్మ్..

Director Bobby: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘కాకా’. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీ విడుదలపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, 2027..జనవరి సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కూడా విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో ‘కాకా’ వాయిదా పడబోతుందంటూ రూమర్స్ వినిపించాయి. కానీ, అవన్నీ కంప్లీట్‌గా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.

తాజాగా, దర్శకుడు బాబీ చేసిన ట్వీట్‌తో ఈ సినిమా విడుదలపై మరోసారి కన్‌ఫర్మేషన్ వచ్చేసింది. మేకర్స్ ముందు నుంచి చెప్తున్నట్టుగానే జనవరి 13నే థియేటర్లలోకి ‘కాకా’ వస్తోంది. ఈ సినిమా వాయిదా పడుతుందనే ప్రచారానికి చెక్ పెడుతూ చిత్ర దర్శకుడు బాబీ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా తాజాగా పోస్ట్ చేశారు. ఇందులో ‘కాకా’ విడుదలకు ఇంకా 47 రోజులు మాత్రమే ఉన్నాయని చెబుతూ, 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న కాకా సినిమా థియేటర్లలోకి వస్తుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు.

దీంతో మెగా అభిమానుల్లో మొదలైన సందేహాలకు తెరపడినట్లయింది. గతంలో బాబీ, మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఇలాగే, సంక్రాంతికి వచ్చి భారీ కమర్షియల్ హిట్ సాధించింది. దీంతో, మరోసారి చిరు-బాబీ కాంబోలో రూపొందుతోన్న కాకా మూవీపై అంచనాలు తారా స్థాయిలో పెరిగాయి. ఇక, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ చిరు కూతురు పాత్రలో నటిస్తోంది.

‘మెగా పొంగల్’ అంటూ కోన వెంకట్ కూడా క్లారిటీ..

ఇక, ఈ సినిమాకి పనిచేస్తున్న రచయిత కోన వెంకట్ కూడా ఇప్పటికే ‘కాకా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. తమ లక్ష్యం, ఫోకస్, టార్గెట్ జనవరి 13నే అని పేర్కొంటూ, ఈసారి మెగా పొంగల్ కాబోతోందంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చిరంజీవి, దర్శకుడు బాబీతో కలిసి ఉన్న ఫొటోను కూడా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. మొత్తానికి, కాకా చిత్రం రావడం పక్కా అని మళ్ళీ క్లారిటీ వచ్చేసింది. కాబట్టి, విశ్వంభర సినిమానే సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చునని అర్థమవుతోంది. మరి, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

తర్వాత చదవండి