వ్యాపారం

Tech News: ఇన్‌స్టాలో అదిరిపోయే ఫీచర్.. సరికొత్త డిస్‌ప్లే డిజైన్‌తో Apple iPhone 20 Pro

Tech News:: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో సరికొత్త సంచలనానికి Apple సిద్ధమవుతోంది. ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో రాబోతున్న iPhone 20 Pro గురించి ఆసక్తికరమైన లీకులు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో ఇప్పటివరకు ఐఫోన్లలో చూడని సరికొత్త డిస్‌ప్లే డిజైన్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Tech News: టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. కొత్త కొత్త అప్‌డేట్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ టెక్ రంగంలో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి? ఏ బ్రాండ్ నుంచి కొత్తగా ఏమేం వస్తున్నాయి? అందులోని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం..

Apple iPhone 20 Pro.. ఇప్పటివరకు చూడని డిస్‌ప్లే డిజైన్!

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో సరికొత్త సంచలనానికి Apple సిద్ధమవుతోంది. ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో రాబోతున్న iPhone 20 Pro గురించి ఆసక్తికరమైన లీకులు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో ఇప్పటివరకు ఐఫోన్లలో చూడని సరికొత్త డిస్‌ప్లే డిజైన్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ డిస్ ప్లే ని ఈ ఐఫోన్ 20 ప్రోలో యూజ్ చేయబోతున్నారని సమాచారం. చూడటానికి ఫోన్ ఒకే గ్లాస్ పీస్‌లా కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు.. డిస్‌ప్లే కింద Face ID టెక్నాలజీ, మరింత చిన్న కెమెరా కటౌట్ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ డిజైన్ నిజమైతే ఐఫోన్ లవర్స్‌కు మాత్రం పెద్ద ట్రీట్ అనే చెప్పాలి.

Xiaomi ప్యాడ్స్ ధరలు పెంపు..

Xiaomi తన ప్యాడ్స్ ధరలను పెంచేసింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.2వేల వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా Redmi Pad 2లోని కొన్ని వేరియంట్లపై రూ.2,000 పెంపు ఉండగా.. Xiaomi Pad 8, Redmi Pad 2 Pro మోడళ్లపై రూ.1,000 చొప్పున ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న గ్యాడ్జెట్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఈ పెంపు మరో భారంగా మారనుంది.

OnePlus 17లో అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్

OnePlus తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 17లో ఏకంగా 240Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు లీకులు బయటకు వస్తున్నాయి. దాదాపు 6.89 అంగుళాల 2K BOE డిస్‌ప్లేతో పాటు 240Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా థిన్ బెజెల్స్ ఉండొచ్చని సమాచారం.

ముఖ్యంగా గేమింగ్ చేసే వారికి ఈ డిస్‌ప్లే మంచి అనుభూతిని అందించే అవకాశం ఉంది. అయితే 240Hz డిస్‌ప్లే ఇంకా పరిశీలన దశలోనే ఉందని తెలుస్తోంది. ఫోన్ లాంచ్‌కు ఇంకా సమయం ఉండటంతో స్పెసిఫికేషన్లలో మార్పులు రావచ్చు.

Instagramలో అదిరిపోయే ఫీచర్.. ఇక స్టోరీని ఎడిట్ చేసుకోవచ్చు!

Instagram యూజర్లకు ఒక గుడ్ న్యూస్. ఇప్పటివరకు Instagramలో స్టోరీ పోస్ట్ చేసిన తర్వాత ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా, కొత్తగా ఏదైనా యాడ్ చేయాలన్నా స్టోరీని డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. ఇన్ స్టా గ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో స్టోరీ పోస్ట్ చేసిన తర్వాత కూడా 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు.

అంటే టెక్స్ట్‌లో తప్పులు సరిచేసుకోవచ్చు.. మ్యూజిక్ మార్చుకోవచ్చు.. కొత్త స్టిక్కర్లు, డ్రాయింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరో స్పెషల్ విషయం ఏంటంటే.. ఎడిట్ చేసినా ఇప్పటికే వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైస్ మాత్రం పోవు. ఎడిట్ చేసిన స్టోరీపై 'Edited' అనే లేబుల్ కూడా కనిపిస్తుంది. స్టోరీని ఓపెన్ చేసి కింద ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేస్తే 'Edit Story' ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి వస్తోంది.

తర్వాత చదవండి