ఏది నిజం

Sharmila Daughter Wedding: షర్మిల కుమార్తె పెళ్లికి నలుగురు సీఎంలు డుమ్మా.. కారణం అదేనా?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి(ys anjalireddy), డాక్టర్ సోమల రఘురామిరెడ్డి(dr somala raghuramireddy)ల వివాహ వేడుకకు దక్షిణాదికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి(ys anjalireddy), డాక్టర్ సోమల రఘురామిరెడ్డి(dr somala raghuramireddy)ల వివాహ వేడుకకు దక్షిణాదికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు సమీపంలోని నంది హిల్స్ రిసార్ట్స్ వేదికగా బుధ, గురువారాల్లో జరిగిన ఈ వివాహ వేడుకలకు(marriage event) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎ. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్ హాజరుకాలేదు.

వివాహానికి ముందు షర్మిల దంపతులు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందించినప్పటికీ, వేర్వేరు కారణాలు, అధికారిక పర్యటనల నేపథ్యంలో వీరంతా పెళ్లికి దూరంగా ఉండిపోయారు. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారిక పర్యటన నిమిత్తం జపాన్‌లో ఉండటంతో వేడుకకు రాలేకపోయినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో ముందుగా నిర్ణయించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం, ప్రభుత్వ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో నిమగ్నమయ్యారు.

 అన్న జగన్‌ను ఆహ్వానించని చెల్లెమ్మ

అటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ అధికారిక షెడ్యూళ్ల కారణంగా వివాహ వేడుకకు హాజరుకాలేకపోయారు. మరోవైపు, ఈ వివాహ వేడుకల్లో వైఎస్ కుటుంబంలోని విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిల ఈ పెళ్లికి ఆహ్వానించకపోవడంతో, వైఎస్ విజయమ్మ తప్ప వైఎస్ కుటుంబానికి చెందిన మిగతా బంధువులందరూ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.

 తొలుత బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వివాహం జరిపించాలని షర్మిల భావించినప్పటికీ, ఆస్తి వివాదాలు, భద్రతా కారణాలతో జగన్ అభ్యంతరం తెలపడంతో వేదికను నంది హిల్స్‌లోని రిసార్టులకు మార్చినట్లు సమాచారం. ఈమేరకు ఇరు కుటుంబాల తరఫున అతికొద్ది మంది సన్నిహితుల మధ్య క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో ఈ వివాహ వేడుకలు ముగిశాయి.

తర్వాత చదవండి