జాతీయం

MK Stalin: ఇండియా కూటమి నేతలతో స్టాలిన్ మీటింగ్.. డీఎంకే సపోర్ట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ!

MK Stalin: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని డీఎంకే ప్రకటించినప్పటి నుంచి జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ కీలక మిత్రపక్షం దూరం కాకుండా చూసుకునేందుకు ఇండియా కూటమి అగ్రనేతలంతా ఆగమేఘాల మీద చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ నివాసంలో ఆయనతో సమావేశమై, బిల్లును వ్యతిరేకించాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ మీటింగ్ నేపథ్యంలో డీఎంకే సపోర్ట్ ఎవరికి ఉంటుందనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

స్టాలిన్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎంఏ బేబీ, సీఎంలు రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, వీడీ సతీశన్ తదితరులు చెన్నై వచ్చారు. అయితే, ఈ నేతల రాకను వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు స్టాలిన్ ఇంటి వద్దే నిరసనకు దిగడం కలకలం రేపింది. ఏకంగా ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు, ఈ మీటింగ్‌పై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ పార్టీ వైఖరి చాలా క్లియర్‌గా ఉందని, స్టాలిన్ ఇప్పటికే పార్టీ ఎంపీలతో చర్చించారని తెలిపారు. ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయమే పార్టీకి ఫైనల్ అని కనిమొళి స్పష్టం చేశారు. కూటమి నేతలతో చర్చలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఇక చెన్నైలో స్టాలిన్‌తో భేటీ ముగిసిన వెంటనే, ఇండియా కూటమి నేతలు ఈరోజు రాత్రి ముంబై వెళ్లి ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌ను కూడా కలవనున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని పవార్‌ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నించనున్నారు. అయితే, కూటమి నేతల ఈ హడావుడిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తనదైన స్టైల్‌లో సెటైర్ వేశారు. పవార్‌తో భేటీపై స్పందిస్తూ.. ‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి ఒకవైపు సొంత కార్యకర్తల ‘గో బ్యాక్’ నినాదాలు, మరోవైపు కూటమి అగ్రనేతల ఒత్తిడి మధ్య స్టాలిన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా నిలబడతారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

తర్వాత చదవండి