సినిమా

Rajkumar Periasamy: ‘ఓం’ సినిమాలో పొలిటికల్ మెసేజ్ ఉండదు..

Rajkumar Periasamy: ఓం సినిమాలో పొలిటికల్ మెసేజ్ ఉండదు అని కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమానే ఓం. కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సౌత్ క్వీన్స్ సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి హిట్ టాక్ వినిపిస్తోంది.

అయితే, ఓం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అటు తమిళ, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో ఆసక్తికరమైన చర్చగా మారాయి. గత కొన్ని రోజుల నుంచి కోలీవుడ్ స్టార్ ధనుష్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సౌత్‌లో వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వచ్చిన ఓం సినిమా కథలో రాజకీయ అంశాలు ఉన్నాయా? ఈ సినిమా ద్వారా ఏదైనా పొలిటికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారా? అంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ‘ఓం’ సినిమా గురించి అందరిలో జరుగుతున్న చర్చల్లో ఇదొకటి. అయితే, ఈ చర్చలకు దర్శకుడు రాజ్ కుమార్ పెరియాస్వామి చెక్ పెట్టాడు. ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ సందేశం ఉండదని తేల్చిపారేశాడు. విజయ్ మాదిరిగానే ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోన్న విధయం తెలిసిందే. ఆయన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ వెల్ఫేర్ మూవ్‌మెంట్’గా మార్చడం, అభిమాన సంఘాల ప్రతినిధులతో మీటింగులు నిర్వహించడం వంటి పరిణామాలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి.

దీంతో ‘ఓం’ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉంటాయనే రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో అలాంటి ఉద్దేశం లేదని రాజ్ కుమార్ పెరియాస్వామి స్పష్టం చేశారు. ఓం’ సినిమా కేవలం స్పై థ్రిల్లర్ మాత్రమే కాదని, అండర్‌కవర్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించామని దర్శకుడు రాజ్ కుమార్ తెలిపారు. రెండు విభిన్నమైన జానర్ల కలయికతో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే, థియేటర్స్‌లో సందడి చేస్తోన్న ఓం సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

తర్వాత చదవండి