January-12-Vidudala: హిట్ మిషన్ అనిల్ రావిపూడి తన మైల్ స్టోన్ మూవీ 10గా వస్తోంది 'జనవరి 12 విడుదల'. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రతీ సినిమాలాగే 'జనవరి 12 విడుదల'కి అనిల్ మార్క్‌తో ప్రమోషన్స్ ప్రారంభించాడు.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇన్స్టాగ్రాం ద్వారా ఓ వీడియోను వదిలాడు అనిల్ రావిపూడి. 'జనవరి 12 విడుదల' ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ చెప్పడానికి ఏకంగా మణి రత్నం రూపొందించిన క్లాసిక్ మూవీ దళపతి సినిమాలోని బ్రేకప్ సీన్‌నే వాడేశాడు. మక్కీకి మక్కీగా ఆ సీన్‌ని రీ క్రియేట్ చేస్తూ హీరోయిన్, కీర్తి సురేష్..కృతి శెట్టిలతో చేసిన ఫన్ వీడియో బాగా వైరల్ అవుతోంది.

ఇక, ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కీర్తిసురేష్, కృతి శెట్టిలకి సరైన సక్సెస్‌లు లేవు. దీంతో, ఈ ఇద్దరూ కూడా అనిల్ రావిపూడి మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. వరుసగా 9 బ్లాక్ బస్టర్స్ కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్, హిట్ మిషన్ అని పేర్లు తెచ్చుకున్న రావిపూడి జనవరి 12 విడుదలతో 10వ సినిమా కాబోతుండటం విశేషం.
మరి, ఈ సినిమాతో భారీ స్థాయిలో పోటీ ఉన్న సంక్రాంతి బరిలో దిగి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక, వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బావ-బామ్మర్ది పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సినిమాకి హైలెట్‌గా నిలవబోతోంది. సురేష్ బాబు సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.
