సినిమా

Venky Kudumula: సాలీడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తా..

Venky Kudumula: యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ఆశ, ఆరాటంతో వెంటపడుతుంటారు. కానీ, అందరికీ..ఆ ఛాన్స్ దక్కదు. పైపెచ్చు అన్నీ కుదరాలి. రచయితగా, దర్శకుడిగా అగ్ర హీరోలతో సినిమాలు చేసిన రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి కూడా ఇంకా చిరంజీవితో సినిమా చేసే అవకాశం రాలేదు. అలాంటిది, స్వయంగా చిరు మాత్రం వెంకీ కుడుముల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఛలో సినిమాతో దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల, మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భీష్మ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు చూసిన మెగాస్టార్..ఏకంగా తనకి కథ చెప్పమని ఆఫర్ చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. చిరు అడిగినట్టుగానే వెంకీ కుడుమల ఓ కథ కూడా వినిపించాడు. కానీ, ఫస్ట్ ఆఫ్ నచ్చినంతగా సెకండ్ హాఫ్ చిరుకి నచ్చలేదు.

Director Venkey Kudumula Tweet
Venky Kudumula Tweet On Megastar's Movie

దీంతో, కొన్ని మార్పులు చేర్పులు చేసుకు రమ్మని చెప్పాడు చిరంజీవి. కానీ, ఆ తర్వాత వెంకీ మళ్ళీ ఆయన్ని కలవడానికి వెళ్ళలేదు. బ్యాలెన్స్ ఉన్న సెకండ్ హాఫ్ చెప్పనూ లేదు. ఇదే విషయాన్ని ఓ సినిమా ఈవెంట్‌లో గుర్తు చేసిన చిరు..నువ్వు వచ్చి కథ చెప్తావని చకోర పక్షిలా ఎదుచూశానని తనదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ చేశాడు మెగాస్టార్.

ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..త్వరలో సాలీడ్ ఎంటర్‌టైనర్‌తో వచ్చి కలుస్తానని రాసుకొచ్చాడు. ఎప్పటి నుంచో మెగాస్టార్-వెంకీ కుడుముల కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ, సెకండ్ హాఫ్‌తో మెప్పించలేక ఇంతకాలం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు, మళ్ళీ ఈ కాంబోకి ఆజ్యం పోశారు చిరు. సో, వెంకీ తాజా పోస్ట్‌ను బట్టి వీలైనంత త్వరలో..చిరంజీవిని కలిసి కథ చెప్పనున్నాడు.

తర్వాత చదవండి