సినిమా

KaaKa: ‘ఆటో జానీ’ గుర్తున్నాడా?..చిరు న్యూ పోస్ట్ వైరల్..

KaaKa: ఇంతకముందు సినిమా అప్‌డేట్స్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చేవి. ఆ తర్వాత దర్శకుడు నుంచి. తర్వాత థమన్ లాంటి సంగీత దర్శకులు కిక్కిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సినిమా అప్‌డేట్స్‌ను పంచుకుంటూ అటు అభిమానుల్లో, ఇటు సినీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా తమ సినిమా అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటున్నారు. మెగాస్టార్ కూడా ఈ విషయంలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు.

ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా కాకా. బాబి కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, గెటప్ శీను, సునీల్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, కాకా సినిమా నుంచి వస్తున్న విజువల్ ట్రీట్ అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మళ్ళీ బాబీ-చిరు కాంబినేషన్‌లో వస్తున్న కాకా భారీ అంచనాలతో ఇప్పటికే ప్రీ బిజినెస్ కూడా జరుపుకుంది.

అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాను కాకా విడుదల తేదీలో దింపి ఇంకో డేట్‌ను కాకా కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి, మేకర్స్ క్లారిటీని కూడా ఇచ్చారు. జనవరి 13నే కాకా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని కన్‌ఫర్మ్ చేశారు. అయినా, కూడా రూమర్స్ ఆగడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో చిరు పెట్టిన పోస్ట్ ఇక నో రూమర్స్ అన్న విధంగా వైరల్ అవుతోంది.

‘ఆటో జానీ’ గుర్తున్నాడా?

రౌడీ అల్లుడు సినిమాలో ‘ఆటో జానీ’ పాత్ర ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరు నటిస్తున్న కాకాలోనూ ‘ఆటో జానీ’ పాత్ర పోలికలుండబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. “ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు. ఈసారి ఆటో జానీలో ఓ కొత్త కోణాన్ని చూపిస్తూ మిమ్మల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నాను” అని పోస్ట్‌లో చిరు రాసుకొచ్చాడు. డైరెక్టర్ బాబీ, మిగతా చిత్రబృందం అందరూ ఈ సినిమాను ఓ మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని ఇచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, తాజాగా పెట్టిన ఈ పోస్ట్‌కి సరికొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ ఇప్పుడు అంతా వైరల్ అవుతోంది.

తర్వాత చదవండి