సినిమా

Karthik Varma: వృషకర్మ మొదటి 10 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు..

Karthik Varma: వృషకర్మ(Vrushakarma) మొదటి 10 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు..అంటూ దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) ప్రేక్షకులను రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ కామెంట్స్‌తో ఇండస్ట్రీ వర్గాలలోనూ వృష కర్మ(Vrushakarma) సినిమాపై అంచనలు రెట్టింపయ్యాయి. కొన్ని సినిమాలు..మొదటి 10 నుంచి 15 నిముషాలలోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేస్తాయి. అలాంటి, సినిమాల ఫ్లో గనక మిస్ అయితే..ఆ తర్వాత సినిమా ఎంతసేపు చూసినా అర్థం కాదు.

అదే విషయాన్ని యువ దర్శకుడు కార్తీక్ వర్మ(Karthik Varma) చెప్పడమే కాదు, విజ్ఞప్తి కూడా చేశాడు. ఇంతకముందు సాయి ధరం తేజ్(Sai Dharam Tej)-సంయుక్త మేనన్‌(Samyukta Menon)లతో రూపొందించిన విరూపాక్ష(Virupaksha) సినిమా భారీ హిట్ సాధించింది. ఈ సినిమాను కూడా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ హిట్ తర్వాత కార్తీక్ వర్మ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అందరిలోనూ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇక, ఈ సినిమా కథ-కథనాలు-ఎడిటింగ్, ట్రైలర్ కట్ లాంటి కీలకమైన అంశాలలో సుకుమార్ సపోర్ట్ చేస్తున్నాడు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తోంది. మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాగా వస్తోన్న వృష కర్మ చిత్రం అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaithanya) కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుందని చిత్రబృందం చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇలాంటి, థ్రిల్లర్ సినిమాలను మొదటి క్షణం నుంచే చూడాలి. అప్పుడే ఆ కిక్కుంటుంది. లేదంటే సినిమాను ఎంజాయ్ చేయలేము. దర్శకుడు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే, ఎత్తుగడే ఎంతో ఇంటెన్సివ్‌గా ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. అందుకే, మొదటి 10 నిముషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దని కార్తీక్ వర్మ ప్రేక్షకులను, అభిమానులను కోరారు. మరి, ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరీ(Meenakshi Chaudary) నటించింది. ఇక్కడ, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వృష కర్మ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

తర్వాత చదవండి