సినిమా

Megastar-Kaaka: "కాకా" నైజాం హక్కులు దక్కించుకున్న ఏషియన్ సురేష్..

Megastar-Kaaka: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ సినిమా "కాకా"(Kaaka). ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. 2027, జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వంభర(Vishwambhara) సినిమా కోసం కాకా(Kaaka) సినిమాను పోస్ట్ పోన్ చేస్తారని ప్రచారమవుతున్న వార్తలకి తాజాగా దర్శకుడు బాబీ(Director Bobby) చెక్ పెడుతూ ఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేశాడు. ఇక, ఈ సినిమా నైజాం రైట్స్‌ను ఏషియన్ సురేష్ దక్కించుకున్నారు.

"కాకా" సినిమాకి బిజినెస్ వ్యవహారాలు స్టార్ట్ అయ్యాయి. మైత్రీ లేదా దిల్ రాజు చేతికి కాకా సినిమా నైజాం రైట్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే, సితార వాళ్ళు కూడా నైజాంలో రిలీజ్ చేసేందుకు రైట్స్ ట్రై చేసినట్టుగా వార్తలు వచ్చాయి. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నైజాం రైట్స్ కోసం ఫ్యాన్సీ అమౌంట్ ఆఫర్ చేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

కానీ, ఫైనల్‌గా ఈ సినిమాను నైజాం ఏరియాలో రిలీజ్ చేసేందుకు ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కాకా టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దర్శకుడు బాబీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎ.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం, సౌత్‌లో క్రేజ్ ఉన్న యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెది, మూగమ్మాయి పాత్ర అని ఇటీవల చిరు హింట్ ఇచ్చాడు కూడా.

ఈ ఏడాది ప్రారంభంలో "మన శంకరవరప్రసాద్‌గారు" సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న మెగాస్టార్..2027 సంక్రాంతికి "కాకా" మూవీతో అంతకుమించిన హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. గెటప్ శీను, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సంక్రాంతికి వెంకటేష్-కళ్యాణ్ రామ్ ల "జనవరి 12 విడుదల" వంటి సినిమాలు పోటీ ఉన్నా 'కాకా'కి మాత్రం మంచి క్రేజ్ ఉంది. మరి, ఈ సినిమా నైజాంలో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

తర్వాత చదవండి