సినిమా

Megaverse Promo: మిస్ చేసిన "N" అక్షరానికి మీనింగ్ ఇదే

Megaverse Promo: మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూనే సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ టాక్ షోను చేయబోతున్నాడు. తాజాగా, దీనికి సంబందించి మెగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి పేరులో ఎన్ అక్షరాన్ని మిస్ చేస్తూ హైదరాబాద్‌లో ఈ మధ్య ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకు, ఎన్ అక్షరం మిస్ అయిందని రక రకాలుగా మాట్లాడుకున్నారు.

ఇన్ని రోజులు అసలు చిరంజీవి పేరులో ఎన్ అక్షరాన్ని ఎందుకు మిస్ చేశారు? దీని వెనుక ఏదైనా స్పెషల్ ప్రమోషనల్ స్ట్రాటజీ ఉందా? అంటే..చిరుకు అత్యంత సన్నిహితులు అవుననే మాట్లాడుకున్నారు. కానీ, అదేంటో రివీల్ చేయలేఉద్. తాజాగా, ఈ సస్పెన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ వారు తెరదించారు. ఇప్పటి వరకూ స్మాల్ స్క్రీన్ మీద, ఓటీటీలలో చాలా ఎంటర్‌టైనర్ టాక్ షోలు వచ్చాయి. కానీ, హోస్ట్ పేరుతోనే ఇలాంటి ప్రయోగం చేసింది లేదు.

N అంటే నెట్‌ఫ్లిక్స్.. ఇదే ఇన్నాళ్ళు దాచిన అసలు ట్విస్ట్!

తాజాగా విడుదల చేసిన మెగావర్స్ ప్రోమోలో మిస్ అయిన ఆ "N" అక్షరానికి సంబంధించిన అసలు సీక్రెట్‌ను రివీల్ చేశారు. చిరంజీవి పేరులో మిస్ అయిన "N" అంటే ఇంకేదో కాదు.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్. చిరు ఫస్ట్ టైం హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకే, చిరంజీవి పేరులోని N అక్షరాన్ని మిస్ చేసి ఈ వినూత్న ప్రమోషన్‌ను ప్లాన్ చేశారు.

చిరు అదిరిపోయే డైలాగ్ "ఇది నా అడ్డా"!

తాజాగా విడుదలైన ప్రోమోలో మెగాస్టార్ తనదైన స్టైల్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. చివర్లో 'ఇది నా అడ్డా' అంటూ చెప్పిన డైలాగ్ ప్రోమోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సందర్భంగా 'మెగా నాస్టాల్జియా.. మెగా నవ్వులు.. మెగా ముచ్చట్లు' అంటూ షోపై అంచనాలను పెంచేసింది. కాగా, ఈ మెగావర్స్ షోకి సినీ ప్రముఖులు హాజరవనున్నారు. ఫస్ట్ సీజన్ 15 ఏపిసోడ్లుగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని, సందీప్ రెడ్డివంగా లాంటి వారు మెగావర్స్ కోసం రాబోతున్నారు.

తర్వాత చదవండి