సినిమా

Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది అవార్డుల జ్యూరీ చైర్మెన్‌గా బాలకృష్ణ

Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ నంది అవార్డుల సందడి మొదలవబోతోంది. గత కొన్నేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నటువంటి నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అవార్డుల ఎంపిక కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో, భాగంగానే సినీ నటుడు, హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు ప్రభుత్వం మరో కీలకమైన బాధ్యత అప్పగించింది.

జ్యూరీ చైర్మన్‌గా బాలకృష్ణ..

బాలకృష్ణను 2017 నుంచి 2024 వరకు అందించనున్న ప్రత్యేక పురస్కారాల ఎంపిక కమిటీకి చైర్మన్‌గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ కమిటీలో బాలయ్యతో పాటుగా.. వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, కైకాల నాగేశ్వరరావు సభ్యులుగా ఉండబోతున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డుల ఎంపిక బాధ్యత ఈ కమిటీ పరిధిలో ఉండబోతోంది.

ఇక, ఇదే సమయంలో 2025 సంవత్సరానికి గానూ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీకి కూడా బాలయ్యనే చైర్మన్‌గా నియమించడం విశేషం. ఈ కమిటీలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా ఉండనున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి అందరూ ఎదురుచూస్తున్న నంది అవార్డుల ప్రదానోత్సవం ఈ డిసెంబర్‌లో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లులు చేస్తోంది. ఇక, కమిటీల ఏర్పాటు పూర్తి కావడంతో త్వరలోనే.. ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఈసారి నంది అవార్డుల ఎంపికపై సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.

కాగా, బాలకృష్ణ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నారు. దీని, తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న ఎన్‌బికే 112 సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాను 2027 సమ్మర్ కానుకగా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తోంది.

తర్వాత చదవండి