సినిమా

Tollywood: ‘స్పిరిట్’ తర్వాత "యానిమల్ పార్క్"..రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ

Tollywood: ‘స్పిరిట్’ తర్వాత "యానిమల్ పార్క్"..రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ. గత కొన్ని రోజుల నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడనే ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ చక్కర్లు కోడుతోంది. ప్రస్తుతం, ప్రభాస్‌తో చేస్తున్న స్పిరిట్ షూటింగ్ దశలో ఉంది. దీని, తర్వాత పలువురు స్టాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. దీనికి, ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ యానిమల్ సీక్వెల్ అని ఓపెన్ చేశాడు.

ఇంటెన్సివ్ యాక్షన్ సినిమా కథకి హ్యూమన్ ఎమోషన్స్ జోడించి కమర్షియల్ హిట్ కొట్టడమే కాకుండా ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్..ఈ మూడు సినిమాలతో దిగ్గజ దర్శకుల లిస్ట్‌లో చేరాడు. అర్జున్ రెడ్డి తర్వాత స్టార్స్ కూడా ఆయన కథ చెప్తానంటే డేట్ ఇవ్వని పరిస్థిని చూశాడు.

కానీ, అనిమల్ తర్వాత అదే స్టార్స్ తనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. అంతగా బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, త్రిప్తీ డిమ్రీలతో చేసిన అనిమల్ సినిమా ప్రభావం చూపించింది. ఇక, ప్రస్తుతం, డార్లింగ్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ పవర్ ఫుల్ కాప్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ముందుగా 2027, మార్చి 5న రిలీజ్ అనుకున్నారు. కానీ, ఫౌజీ షూటింగ్ ఆలస్యం అవడం వల్ల ఆ ప్రభావం స్పిరిట్ మీద పడి 2027 అక్టోబర్ 29కి రీ షెడ్యూల్ అయింది.

అయితే, స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడని, మహేష్ బాబుతో అని, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్స్ పేర్లు ప్రచారమవుతున్నాయి. దీనికి, స్వయంగా సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. 2027, అక్టోబర్ 29న ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

దీని, తర్వాత తన సొంత సంస్థతో పాటు టీ-సిరీస్ వారితో కలిసి అనిమల్ సీక్వెల్ అనిమల్ పార్క్ చిత్రాన్ని రణ్‌బీర్ కపూర్‌తో చేయనున్నట్టుగా వెల్లడించాడు. ఇందులో, ఈ సారి రణ్‌బీర్ డ్యూయల్ రోల్‌లో కనిపించే అవకాశాలున్నాయి. అన్నదమ్ముల మధ్య యుద్ధం నేపథ్యంలో అనిమల్ పార్క్ కథ సాగుతుందని తెలుస్తోంది. సో మొత్తానికి, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి సందీప్ చెక్ పెడుతూ అనిమల్ సీక్వెల్‌ను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

తర్వాత చదవండి