TVK MLA Arrest: ప్రజాప్రతినిధిగా ఉంటూ హుందాగా నడుచుకోవాల్సిన ఓ ఎమ్మెల్యే, ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి పట్ల తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌కే దరిద్రమైన మెసేజ్‌లు పంపి చివరకు కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని కళ్లకురిచ్చి నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు అక్కడి రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది.
అసలు ఏం జరిగిందంటే.. ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ కొంతకాలంగా ఓ మహిళా కలెక్టర్ సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన, దరిద్రమైన మెసేజ్‌లు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన సదరు కలెక్టర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో అన్నాడీఎంకేకు చెందిన ఓ లాయర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తును స్వయంగా ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో కదిలిన కళ్లకురిచ్చి పోలీసులు.. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే విఘ్నేశ్‌పై ‘మహిళా వేధింపుల నిరోధక చట్టం’లోని ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు వేగవంతం చేసి తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఏకంగా ఒక జిల్లా కలెక్టర్‌కే ఎమ్మెల్యే ఇలాంటి మెసేజ్‌లు పంపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
