స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Politics: పంది ముఖం ప్రచారం ఎందుకు?

సైలెంట్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఓ అకౌంట్ వైరల్ అవుతోంది. ‘‘పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా’’ అనే ట్యాగ్‌లైన్‌తో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఏకంగా పోస్టర్లు కూడా అంటించారు.

- తరతరాలు తిన్నా తరగని ఆస్తులపై విన్నూత నిరసన!

- అధికార స్వభావంపై తెలంగాణ, ఏపీలో ఛానల్స్ వద్ద పాంప్లెట్స్?

- పొలిటికల్ లీడర్ ఐదేళ్లు పందిలా తింటాడు, పోతాడు?

- 30 ఏండ్లు ప్రభుత్వ ఉద్యోగం అప్పగిస్తే కొంతమంది అధికారులు కూడా వారికేం తక్కువ కాదన్నట్టు తయారయ్యారు?

- భోగాలు అనుభవిస్తున్నారు.. పనుల పేరుతో దోచుకుంటున్నారు?

- రాజ్యాంగం ఇచ్చింది ఏంటి?.. ప్రజాప్రతినిధుల పేరుతో మీరు చేస్తోంది ఏంటి?

- 5 శాతం సాఫ్ట్‌వేర్ నేతల్ని ఊహించుకునే మీరు, 80శాతం రైతుల కష్టాన్ని అర్ధం చేసుకోలేరా?

- మీ వ్యవహారాలతో పంది పోస్టర్స్ మీ ముఖంతో వస్తాయి కావొచ్చు?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్

Swechaanews.com

పరిపాలనపై ఎందుకు పంది ముఖం వచ్చింది?

సైలెంట్ పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఓ అకౌంట్ వైరల్ అవుతోంది. ‘‘పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా’’ అనే ట్యాగ్‌లైన్‌తో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల్లో ఏకంగా పోస్టర్లు కూడా అంటించారు. వాటిలో పంది ఫేస్‌తో ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఈ మెసేజ్ వచ్చినా ఏదో ప్రచారం కోసం చేశారని అనుకుని టాప్ 10 శాటిలైట్ ఛానల్స్ పట్టించుకోలేదు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వద్ద పడేశారు. నాలాంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఏదో పైత్యంతో చేశారని నేను కూడా వదిలేశాను. కానీ, కొద్దిగా తవ్వితే వాళ్ల అసంతృప్తి ఎంత ఉందో అర్ధమైంది. వారంతా ఏం ఉద్దేశించి, ఆశ పడిన జీవితాలు కాదు. ఏదో చేయాలనే తాపత్రయంతో చేసిన చిన్న ఆలోచన అని అనిపిస్తోంది. వాళ్ల ఆలోచనకు మించి స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఆరా తీయగా సారాంశం బయటపడింది.

అప్పుడు అయోయ్ కుమార్.. ఇప్పుడు నారాయణ రెడ్డి..

ఆనాడు హరీష్ రెడ్డి.. ఈనాడు మను చౌదరి

ఉమ్మడి రంగారెడ్డిలో విలువైన భూములను కాపాడాల్సిన వాళ్లంతా ఏదో రకంగా పందుల్లాంటి అధికార పార్టీ నేతల మాటలు నమ్మి ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. సీలింగ్ ల్యాండ్స్, అసైన్డ్ భూములు ఇలా వందల ఎకరాలు రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్లు భూ భారతిలో అధికారిక హక్కులు ఇచ్చినట్లు పత్రాలు ఇచ్చేశారు. ఆనాడు ఇలాగే ఐఏఎస్‌లు ఇచ్చి ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో వందల ఉదాహరణలు ఉన్నాయి.

మంత్రిత్వంలో మాయలు ఎన్నో?

గెలిచిన ప్రతి ప్రజా ప్రతినిధి ప్రభుత్వంలో చోటు దక్కేలా మంత్రి కావాలని ఎన్నో పాట్లు పడతారు. అలానే మంత్రి అయ్యాక వారి సంపద ఎలా పెరుగుతుందో ఊహించలేం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తారు. ఒకరికి పీఆర్వో ప్రధానం, మరొకరికి పీఎస్ ప్రధానం, ఇంకొకరికి వాళ్ల ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిందే వేదం. ఈ అధికారులకు, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కు మంత్రుల కంటే ఎక్కువ ప్రజాధనాన్ని ఎలా దోచి సంపాదించుకోవాలో నేర్చుకుంటారు. పేషీలో అందరికీ అవకాశం ఇచ్చేలా పైరవీలు నడుస్తుంటాయి.

చిన్న శాఖ అయిన టూరిజం నుంచి పెద్ద శాఖ అయిన ఫైనాన్స్ వరకు?

ఫైనాన్స్‌లో బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం అంటూ మంత్రి భార్య, అందుకు సహకరించిన అధికారులు పంది ముఖాలే? చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వాలి అని అంటే అధికారులు ఎందుకు మంత్రి పేషీ అనుమతి కావాలని చిన్న చిన్న బిల్లులకు అంటకడుతారు? అధికారులూ.. మీ అవినీతితోనే ఇలా మంత్రులు, వాళ్ల కుటుంబాలు తయారయ్యాయి.

ఇలానే అన్ని?

చిన్న కాంట్రాక్టర్ కూడా ఎమ్మెల్యేకి సమర్పిస్తున్నారు. అదే అధికారులకు మరెన్నో ఇచ్చేస్తున్నారు. ప్రజాప్రతినిధి పందిలా వ్యవహరిస్తాడు. మీకు జీతం, మీరు అనుకున్నట్లు స్కేల్ జీతం, హోదా పెరిగితే ఇంట్లో పని మనుషులు, బాడీ గార్డులు ఇలా ఎన్ని చెప్పుకోవాలి. ఎప్పుడో రాజ్యాంగం చెప్పినట్లు మీ కుటుంబం కోసం హామీ ఇచ్చినా, కోట్లపై ఆశ పడితే రాబోయే రాజకీయాలు ఎలా ఉండాలని పంది ముఖం పెట్టాల్సిందే?

తర్వాత చదవండి