Sailesh Kolanu: గత కొంత కాలంగా టాలీవుడ్‌లో బాగా సక్సెస్ సాధిస్తున్న ఫ్రాంఛైజీస్‌లో ఒకటి హిట్ సిరీస్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకూ మూడు భాగాలు వచ్చాయి. ఈ మూడు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు, హిట్ 4 స్క్రిప్ట్ సిద్ధమైందని దర్శకుడు శైలేష్ కొలను సాలీడ్ అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూడటం మొదలైంది.
హిట్:ది ఫస్ట్ కేస్:
నాని నిర్మాణంలో రూపొందుతోన్న హిట్ ఫ్రాంఛైజీస్‌లో మొదటి భాగం హిట్:ది ఫస్ట్ కేస్ 2020, ఫిబ్రవరి 28న భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా, శైలేష్ కొలను తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, యంగ్ బ్యూటీ రుహానీ శర్మ జంటగా.. మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించాడు. గెస్ట్ రోల్‌లో అడవి శేష్..మీనాక్షి చౌదరి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి నానికి మంచి లాభాలను తెచ్చింది.
హిట్ 2: ద సెకెండ్ కేస్
కేవలం రెండేళ్ళ గ్యాప్ లోనే హిట్ 2: ద సెకెండ్ కేస్ అంటే 2022లో విడుదలైంది పార్ట్ 2. ఈ భాగాన్ని కూడా వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించాడు. అలాగే, ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా.. రావు రమేశ్, భానుచందర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి భాగం కంటే కూడా రెండవ భాగం భారీ కమర్షియల్ హిట్‌ను సాధించింది.
హిట్ 3: ద థర్డ్ కేస్
ఈ ఫ్రాంఛైజీస్‌లో మూడవ భాగంలో నాని నటించడం విశేషం. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన శైలేష్ కొలను ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. అయితే, ఎందుకనో హిట్ 3 కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. క్లైమాక్స్‌లో అడవి శేష్ ఎంట్రీ అదిరింది. అలాగే, హిట్ 4లో కోలీవుడ్ స్టార్ కార్తి నటించబోతున్న విషయాన్ని రివీల్ చేసి క్యూరియాసిటీని పెంచారు. ఇక, తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ను ఇచ్చిన దర్శకుడు శైలెష్..నాని కథ వినడం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు.
