Satvika Veeravalli: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. ఒకవేళ తెలుగమ్మాయిలున్నా..ఎందుకనో అంతగా అవకాశాలు అందడం లేదు. ఇది ఎప్పటి నుంచి వినిపిస్తున్న మాట. అయితే, 'ఆకాశంలో ఒక తార' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న తెలుగమ్మాయి సాత్విక వీరవల్లికి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చిందట.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మిస్టిక్ థ్రిల్లర్ 'వృష కర్మ' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాకి గట్టి పోటీ ఉన్నప్పటికీ మిగతా సినిమాల కంటే నాగ చైతన్య 'వృష కర్మ' మీదే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత అల్లు అరవింద్ నిర్మాణంలో నాగ చైతన్య ఒక సినిమాను చేయనున్నాడు. త్వరలో, ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. అయితే, ఈ ఇందులో నిన్నామొన్నటి వరకూ పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన మేకర్స్, ఇప్పుడు సాత్విక వీరవల్లి పేరును పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఆమెనే ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల, సాత్విక కూడా ఓ తెలుగు సినిమాను చేస్తున్నట్టుగా వెల్లడించింది.
అయితే, ఆ వివరాలను నిర్మాతలే వెల్లడిస్తారని మాట దాటవేసింది. ఇక, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఆకాశంలో ఒక తార' సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. ఆమెకి సహాయం చేసే వ్యక్తిగా దుల్కర్ పాత్ర ఉంటుంది. దర్శకుడు పవన్ సాదినేని సాత్వికకి అద్భుతమైన పాత్రను డిజైన్ చేశాడు. ఆమె సినిమాకి మేజర్ ప్లస్ కానుంది. ఇప్పటికే, ఇండస్ట్రీలో పలువురు సాత్వికను తమ సినిమాలలో తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి, మొదటి సినిమా రిలీజ్ కాకుండా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌పై సైన్ చేయడం గ్రేట్.
