Sharwanand: ఈ ఏడాది చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదట నారి నారి నడుమ మురారి సినిమా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. దీని, తర్వాత వచ్చిన బైకర్ కూడా మంచి హిట్ సినిమాగా నిలిచింది. కానీ, హ్యాట్రిక్ హిట్ కొడతాడనుకున్న లేటెస్ట్ సినిమా భోగి మాత్రం ఆశించిన హిట్ సాధించలేదు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
గత కొంతకాలంగా దర్శకుడు సంపత్ నంది సక్సెస్‌లు లేక సతమతమవుతున్నాడు. సీటీమార్ దర్శకుడిగా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. నిర్మాతగా చేసిన ఓదెల 2 కూడా ఇలాంటి ఫలితాన్నే ఇచ్చింది. ఇలాంటి, సమయంలో మాస్ అండ్ యాక్షన్ సినిమాగా సంపత్ నంది భోగి చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాతో శర్వాకి హ్యాట్రిక్ హిట్ దక్కుతుందని అందరూ భావించారు.
కానీ, నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది. ఎక్కడా కూడా ఈ సినిమాకి థియేటర్స్ హౌజ్ ఫుల్ కాలేదు. ఇది, నిజంగా ఎవరూ ఊహించలేదు. వాస్తవానికి, భోగి అనే టైటిల్‌తో సినిమా అంటే పండగ వాతావరణం ఫ్యామిలీ ఎమోషన్స్..మంచి కామెడీ..ఇలా చాలా ఊహిస్తారు. ఇలాంటి, టైటిల్‌తో సినిమాను సంక్రాంతి బరికి దింపుతారు.
కానీ, ఇక్కడ ఏ ఒక్కటి పాజిటివ్‌గా జరగలేదు. భోగి అని టైటిల్ పెట్టిన ఈ సినిమాలో హింస ఎక్కువనే మాట వినిపిస్తోంది. ఇక, నవంబర్ రిలీజ్ అనేది కూడా జనాలలో బజ్ క్రియేట్ అవలేదు. హీరోయిన్స్‌గా నటించిన అనుపమ, డింపుల్ పాత్రలకి ప్రాధాన్యత ఉన్నా ఉపయోగం లేదు. ఈ సినిమా కోసం శర్వా ఎంత శ్రమ పడినా అది మొత్తం వృధా అయింది. 2026లో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న శర్వాకి భోగి బ్రేక్ వేసింది.
