సినిమా

Tollywood: సుకుమార్ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం "రికార్డ్" మూవీ!

Tollywood: టాలెంటెడ్ డైరెక్టర్స్, హీరోల కోసం సుకుమార్ తన బ్యానర్‌లో అవకాశాలిస్తూ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో సినిమాను చేస్తున్నాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా, వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.

Tollywood: టాలెంటెడ్ డైరెక్టర్స్, హీరోల కోసం సుకుమార్ తన బ్యానర్‌లో అవకాశాలిస్తూ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో సినిమాను చేస్తున్నాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా, వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.

అయితే, ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరోకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ బ్యానర్‌లో సినిమా చేసే అవకాశం రావడం టాలీవుడ్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే కిరణ్ అబ్బవరం కెరీర్‌కు కొత్త టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా అవుతుంది. ఈ సినిమాకి వీర కోగటం కథను అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. గతంలో, పుష్ప సినిమాకు పనిచేసిన వీర కోగటంకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.

‘రికార్డ్’గా కిరణ్ అబ్బవరం 14వ సినిమా..

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ‘రికార్డ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నవంబర్ 23న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు కలిసి నిర్మిస్తుండటం విశేషం. కాగా, ఈ సినిమా టైటిల్ పోస్టర్ చూస్తుంటే కొత్త తరహా మిస్టరీ కథతో తెరకెక్కించబోతున్నట్లు అనిపిస్తోంది. ఎర్రటి పౌర్ణమి చంద్రుడి బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం సిల్హౌట్, దాని కింద కనిపిస్తున్న గాడిద, చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయి.. ఇలా.. పోస్టర్‌లోని ప్రతీ అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక, ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు సుకుమార్, నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టాడు. సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం ఇంతకముందు నటించిన ‘క’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, ‘రికార్డ్’తో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ తోడవడంతో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. మరి, ఈ రికార్డ్ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..ఎలాంటి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

తర్వాత చదవండి