సినిమా

Tollywood: RC 17లో "16 నుంచి 60" ఏళ్ళ టాలెంట్‌కి మెగా ఛాన్స్

Tollywood: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ టాలెంటెడ్ డైరెక్టర్స్ మాత్రమే అవకాశం ఇవ్వడం లేదు. తమ భానర్‌లో నిర్మించే భారీ చిత్రాలలో కొత్త టాలెంట్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మొదలవబోతున్న సినిమాలో అవకాశం కోసం పిలుపునిచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్..తన 17వ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతున్న ఆర్సీ 17 నుంచి అవకాశం అందుకునేందుకు వీలుగా ఓ ప్రకటనను ఇచ్చింది. ప్రస్తుతం, ఈ ప్రకటనకి సంబందించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ-మైల్ ఐడితో పాటు వాట్సాప్ నంబర్‌ను మైత్రీ ఇచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ నేడు ఈ స్థాయికి వచ్చింది అంటే అది ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ వల్లే. ఈ సినిమాతో చరణ్‌కి భారీ హిట్ దక్కడమే కాదు, ఆయన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ సినిమాగానూ నిలిచింది. ఒక్క చరణ్‌కి మాత్రమే కాదు, మైత్రీకి, సమంత, సుకుమార్‌లకి మైల్ స్టోన్ మూవీగా నిలిచింది ‘రంగస్థలం’.

ఈ సినిమా తర్వాత మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్సీ 17 నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. “కొత్త ప్రపంచం.. కొత్త కథ.. అందులో మీ కోసం ఒక పాత్ర ఎదురుచూస్తుండవచ్చు” అంటూ మేకర్స్ తాజాగా క్యాస్టింగ్ కాల్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ అలాగే, టీ-సిరీస్ ఫిలింస్ కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో భాగం కావడానికి అన్ని 16 నుంచి 60 ఏళ్ళ నటీనటులకు మేకర్స్ అవకాశం ఇస్తున్నారు. ఈ క్రేజీ సినిమాటిక్ జర్నీలో భాగమవ్వాలనుకునే ఆసక్తిగల నటీనటులు తమ ఆడిషన్ వివరాలను "src17casting@gmail.com" మెయిల్ ఐడీకి పంపాలని మేకర్స్ తెలిపారు. అలాగే, 9110564651 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా తమ ప్రొఫైల్స్ పంపవచ్చని మేకర్స్ ప్రకటించారు.

తర్వాత చదవండి