సినిమా

Jagapathi Babu: కార్మికులతో కలిసి భోజనం చేసిన జగపతి బాబు.. నెట్టింట వీడియో వైరల్‌..

Jagapathi Babu: కార్మికులతో కలిసి భోజనం చేసిన జగపతి బాబు. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన తాజా వీడియో వైరల్‌గా మారింది. మన స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ అభిమానుల కోసం కొన్నిసార్లు సర్‌ప్రైజెస్ ఇస్తుంటారు. అలాగే, జగ్గుభాయ్ కూడా కార్మికులకి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

Jagapathi Babu: కార్మికులతో కలిసి భోజనం చేసిన జగపతి బాబు. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన తాజా వీడియో వైరల్‌గా మారింది. మన స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ అభిమానుల కోసం కొన్నిసార్లు సర్‌ప్రైజెస్ ఇస్తుంటారు. అలాగే, జగ్గుభాయ్ కూడా కార్మికులకి స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

వెండితెర మీద భయంకరమైన విలన్‌గా, పవర్‌ఫుల్ పాత్రలతో జగపతి బాబు భయపెట్టే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, స్టైలిష్ విలన్‌గా..మోడ్రన్ ఫాదర్ పాత్రల్లోనూ ఆకట్టుకుంటున్నారు. చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో జగపతి అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, తెరమీద ఎంత విలనిజం చూపిస్తున్నా నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తుగా కనిపిస్తుంటారు.

ఏమాత్రం స్టార్ డమ్ ని తలకెక్కించుకోకుండా ఒక సామాన్యుడిలా జీవించడం జగపతికి మాత్రమే చెల్లింది. తాజాగా, ఆయన కార్మికులతో కలిసి నేలమీద కూర్చుని భోజనం చేసిన వీడియో అభిమానులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతంలో ఫ్యామిలీ హీరోగా జగపతిబాబు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలీందే. ఆ తర్వాత, 'లెజెండ్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే, ఆయన నటించిన 'సలార్ 2', 'సాంబారాల ఏటి గట్టు', 'బ్లాక్ మనీ' లాంటి భారీ చిత్రాలతో మన ముందుకు రాబోతున్నారు. ఇక కష్టాలు, సుఖాలను.. సక్సెస్‌లను, ఫ్లాపులను దగ్గరగా చూశారు కాబట్టే, జగ్గుభాయ్ తన జీవితాన్ని ఇంత సింపుల్‌గా తీసుకోగలుగుతున్నారు.

అయితే, సాధారణంగా సినీ తారలు అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు, క్యారవాన్లు ఉంటాయి. కానీ, జగపతి బాబు మాత్రం అలాంటి ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే కష్టపడి పనిచేసే కార్మికుల ఆకలిని అర్థం చేసుకుని, వారి కోసం స్పెషల్ గా బిర్యానీ తెప్పించి, వారితో పాటే కూర్చుని భోజనం చేయడం అంతటా వైరల్ అవుతోంది. ఇది, ఆయన గొప్ప మనసుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మనుషులంతా సమానమనే భావన ఆయన ప్రతి పనిలోనూ కనిపిస్తుంది. మొత్తానికి, జగుభాయ్ ఇలా సందడి చేయడం ఎంతో ఆసక్తికరంగా మారింది.

తర్వాత చదవండి