తెలంగాణ

NIMS : నిమ్స్ టెండర్లలో భారీ అక్రమాలు.. ఒక్కో బెడ్‌కు రూ. లక్ష లంచం!

నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అక్రమాలు, అవినీతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి ఆయన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ అక్రమాలు, అవినీతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించి ఆయన అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హయాంలో నిమ్స్‌లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.పదవిని అడ్డం పెట్టుకుని చేసిన అవకతవకలపైనా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.ఈ క్రమంలోనే నిమ్స్ హాస్పిటల్ టెండర్లలలో భారీగా అక్రమాలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గుర్తించారు.

కోవిడ్ సమయంలో రోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయింపుల విషయంలో రూ. లక్షలు వసూళ్లు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కరోనా పాండమిక్ టైంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు ఒక్క బెడ్ కేటాయించేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. కాగా, బెడ్ కోసం సుగుణమ్మ అనే మహిళ దగ్గర రూ.లక్ష లంచం తీసుకున్నట్లు ACB ఆధారాలు సేకరించింది.

నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్.. ప్రశాంత్ అనే వ్యక్తితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. క్యాంటీన్లు, మెడికల్ షాప్స్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవ్వగా.. నిమ్స్ రికార్డులో మాత్రం బెడ్ కోసం రూ.వెయ్యి మాత్రమే చెల్లించినట్లు అధికారులు చూపించినట్టు తెలిసింది.

అయితే, ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరూ అని ఆరా తీయగా నిమ్స్ ఉద్యోగి కాదని తెలిసింది. అయినప్పటికీ అతనితో కలిసి నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ కరోనా టైంలో బెడ్ల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు విచారణలో తేల్చారు. ఇదిలాఉండగా, లక్ష్మీ భాస్కర్ ఆస్తుల కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

తర్వాత చదవండి