సినిమా

Naga Chaithanya: "వృష కర్మ"కి సుకుమార్ ట్రీట్‌మెంట్..

Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘వృష కర్మ’. ఇప్పటికే, ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు తాజాగా విడుదలైన ట్రైలర్ ‘వృష కర్మ’ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ నుంచి ప్రత్యేకమైన దృష్టి ఉన్నట్టుగా తెలుస్తోంది. కథ, మేకింగ్‌తో పాటు ఇతర టెక్నికల్ విషయాలలోనూ సుక్కూ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది.

సాయి ధరం తేజ్ నటించిన ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యువ దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొంతుతున్న ‘వృషకర్మ’ చిత్రం ఈ డిసెంబర్ 4వ తేదీన భారీ స్థాయిలో విడుదల అవనుంది. మూవీ టీజర్, ట్రైలర్‌లలో కనిపించిన కాన్సెప్ట్, విజువల్స్, టెక్నికల్ వ్యాల్యూస్, హీరో-విలన్ పాత్రలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

గతంలో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘కుమారి 21ఎఫ్’, సాయి ధరం తేజ్ ‘విరూపాక్ష’ చిత్రాల తరహాలోనే ఈ చిత్ర కథ కూడా సుకుమార్‌కు విపరీతంగా నచ్చడంతో, ఆయనే స్వయంగా స్క్రీన్ ప్లేతో పాటు మేకింగ్, ఎడిటింగ్, ట్రైలర్ కట్‌లలోనూ ప్రధాన పాత్రధారిగా వ్యవహరించినట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ జడ్జ్‌మెంట్ తో వచ్చిన ఈ రెండు సినిమాలతో పాటు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఉప్పెన కూడా సుకుమార్ పర్యవేక్షణలో వచ్చి భారీ హిట్ సాధించాయి. అందుక్ర, నాగ చైతన్య వృష కర్మకి సుకుమార్ తన ట్రీట్మెంట్‌ను అందించినట్టుగా తెలుస్తోంది.

నాగ చైతన్య కెరీర్‌ లో మైల్ స్టోన్ మూవీగా వృష కర్మ:

దర్శకుడు కార్తీక్ దండు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వృష కర్మ చిత్రంలో నాగ చైతన్య సరికొత్త మేకోవర్‌లఒ కనిపిస్తున్నారు. ఇక, కథ పురాతన రహస్యాలు, మైథలాజికల్ అంశాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఉన్న భారీ విజువల్స్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తాయని మేకర్స్ బలంగా చెప్తున్నారు. అంతేకాదు, ఇది చైతూ కెరీర్‌లో మైల్ స్టోన్ సినిమాగా నిలవడం ఖాయమని ఎంతో నమ్మకంగా అంటున్నారు. కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

తర్వాత చదవండి