స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

KrishnaWaterDispute: ఆంధ్రా గండి కొట్టిందని సెప్టెంబర్ 21నే చెప్పాం!

ఎల్‌నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.

  • ఎల్‌నినో పేరుతో హెచ్చరించాం!

  • ఎండుతున్న తెలంగాణ

  • ఆందోళనే తప్ప.. అచరణ, అవగాహన లేని యంత్రాంగం అంటూ వార్తలు

  • జూరాల రైతుల ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం

  • 45 రోజుల తర్వాత అందరూ కళ్లు తెరిచినట్లు బిల్డప్‌లు!

  • 200 టీఎంసీలు ఎటు పోయాయని నిలదీత

  • పొతిరెడ్డిపాడు నుంచి భారీగా తోడుకుపోయిన వైనం?

  • 45 రోజుల క్రితం స్వేచ్ఛ న్యూస్ రాసిన వార్తకు కళ్లు తెరవలేదు!

  • స్వేచ్ఛ న్యూస్ రాసింది ఇదే!

  • శ్రీశైలంలో 15 రోజుల్లోనే 30 టీఎంసీల తగ్గుదల? కనిపించని ఇన్ ఫ్లో

  • ఈ సీజన్‌లో ఇప్పటికే 110 టీఎంసీలు తోడేసిన వైనం

  • తెలంగాణ పవర్ హౌస్‌కు రోజుకు 41 వేల క్యూసెక్కులు విడుదల అంటూ వార్తలు.. 50 కిలోమీటర్ల దూరంలోనే

  • నాగార్జున సాగర్‌కు ఇన్ ప్లో 7 వేల క్యూసెక్కులు మించడం లేదు?

  • దొంగ లెక్కలు , నీళ్లు దోచుకుంటున్న తీరును పట్టించుకోని రేవంత్ సర్కార్

  • హైదరాబాద్‌కు తాగునీటి సమస్య పొంచి ఉన్న తీరు, కృష్ణా జలాల వాడకం ఎలా ఉందో స్వేచ్ఛ న్యూస్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.

ఎల్‌నినో ముప్పు ముంచుకోస్తోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రోజుకో విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కురిసిన కొద్ది నీళ్లను ఒడిసి పట్టుకోకుండా, ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారు. పొతిరెడ్డిపాడుకు 8 వేల క్యూసెక్కులే అంటూ ప్రచారం. కానీ, రోజుకు 3 టీఎంసీలు తరలించుకునేంత గండి పెట్టుకున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట చిత్రావతి లిప్ట్, గోరకల్లు పిన్నపురం వెళ్లే ప్రధాన ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించే ఎస్ఆర్బీసీ రిజర్వాయర్లను వాడుకుంటారు. పిన్నపురం వద్ద గ్రీన్ కో 1,680 మెగా వాట్ల పీఎస్పీ నిర్మాణం చేసింది. ఇలా 14 హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిని డిసెంబర్ లోపే పవర్ సప్లై ఆపివేయాలి.

పొతిరెడ్డిపాడులో ఎన్ని ఎలా వాడుతున్నారో తెలియని పరిస్థితి

పేరుకే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటారు. కానీ, బనకచర్ల వరకు దోచుకునిపోతున్నారు. రోజుకు 3 టీఎంసీలు రాత్రికి రాత్రి తరలించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కొండలను తొలిచివేసింది అందుకే. అక్కడ నుంచి తెలంగాణకు ఎలాంటి సమాచారం ఉండదు. పేపర్లలో తాగు నీటి అవసరాలకు అని చెప్పుకుంటూ రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కానీ, అనధికారికంగా వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి? ఇక్కడ కంట్రోల్ చేయకపోతే, నీళ్లు లేవని చెబుతూ తెలంగాణకు వచ్చే 1 టీఎంసీ నీటితో తయారు అయ్యే విద్యుత్‌కు కొరత ఏర్పడుతుంది. నీరు మళ్లీ నాగార్జున సాగర్‌లో కలుస్తుంది. అక్కడ ఏపీకి వాటా ఉంటుంది. అనధికారికంగా పొతిరెడ్డిపాడు వెళ్లే నీళ్లు పెన్నాకు వెళ్తాయి. తెలంగాణకు హక్కు లేకుండా పోతుంది. ఫలితంగా హైదరాబాద్‌కు నీటి కష్టాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏటా 30 టీఎంసీలు హైదరాబాద్‌కు అవసరం. కానీ, 20 రోజుల్లోనే నాగార్జున సాగర్‌లో 4 టీఏంసీలు ఖర్చు అయ్యాయి. ఇన్ ఫ్లో లేదు. ఔట్ ప్లో నుంచి పులిచింతలకు చేరుకుంటున్నాయి. డబుల్ ఔట్ ప్లో కావడం. ఎడమ గట్టులో విద్యుత్ తయారీ అధికారికంగా సాగర్‌కి చేరకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గేట్ లీకేజీలు లేవు. వరద జలాలు కాకుండా బురద జలాలను సైతం లాగేసుకునే కెపాసిటీ పొతిరెడ్డి పాడుకు ఉంది. అందుకే గ్రావిటీ మీద నీళ్లను దోచుకుంటున్నారు. ఆనాడు ఈ కాంట్రాక్ట్ చేసింది ఏపీలో ఓ జిల్లాకు చెందిన మంత్రి బ్రదర్స్ యే?

జూరాల లొల్లి?

రైతులు జూరాల నిండిందని పంటలు వేసుకున్నారు. 12 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పంటలకు నీరు వదలడం లేదు. భవిష్యత్ పేరుతో మంచిగా ఆలోచించినా, అది అధికారులకు, రైతులకు అర్ధం అయ్యేలా చెప్పే నాథుడే లేడు. అప్పర్ కృష్ణ, భీమా నుంచి నీళ్లు రావడం లేదు. వీళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రం జూరాల గేట్లను తెరిచి శ్రీశైలంకు వదులుతున్నారు. ఈ చర్యలు అక్కడి రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. నేరుగా వెళ్లి గేట్లు ఎత్తేసేలా ప్రయత్నం కూడా చేశారు.

హైదరాబాద్‌కు నీటి కష్టాలు

ఎల్‌నినో ఇలానే కొనసాగితే ఫిబ్రవరి వరకు కృష్ణా వాటర్ వాడుకునే అవకాశాలు ఉంటాయి. మరో 4 నెలలు మాత్రం ఎన్నో కష్టాలు పడే అవకాశాలు ఉంటాయి. ఏపీ, తెలంగాణ నీళ్ల వాడకంపై రోజూ రివ్యూలు లేకుంటే హైదరాబాద్ నీళ్ల కోసం ఇబ్బంది పడడం ఖాయం. అయితే, సాగర్‌లో ఎన్ని నీళ్లు ఉన్నాయి. ఇప్పటికే కరెంట్ కోతలతో సతమతం అవుతుంటే, ఇప్పుడు నీళ్లు కూడా తగ్గిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు.

సాగర్ ఎండిపోతోంది.. హైదరాబాద్‌కు నీళ్లు లేవని ముందే హెచ్చరించాం

మరో పత్రికలో వార్త రాగానే అంతా ఇప్పుడే జరిగినట్లు చేస్తున్న వ్యవహారం చూస్తుంటే, ఇప్పుడే ఉదయించినట్లు మేలుకుంటున్న పొలిటికల్ తీరును చూసి సిగ్గేస్తోంది.

తర్వాత చదవండి