జాతీయం

RBI Guidelines: లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే.. హామీదారుడు కట్టాలా? రూల్స్ ఏం చెప్తున్నాయ్?

5 నిమిషాల పఠనం

RBI Guidelines: హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్.. ఇలా ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కచ్చితంగా హామీదారుడు సంతకం, ఆధార్ వివరాలు అడుగుతాయి. ఎవరో ఒకరు ష్యూరిటీ సంతకం పెట్టకపోతే సాధారణంగా బ్యాంకులు లోన్లు మంజూరు చేయవు. ఇలాంటి టైంలో మన ఫ్రెండ్స్, బంధువులు వచ్చి "ఏం కాదు, జస్ట్ ఒక సంతకం పెట్టు చాలు" అని అడుగుతుంటారు.

RBI Guidelines: హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్.. ఇలా ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కచ్చితంగా హామీదారుడు సంతకం, ఆధార్ వివరాలు అడుగుతాయి. ఎవరో ఒకరు ష్యూరిటీ సంతకం పెట్టకపోతే సాధారణంగా బ్యాంకులు లోన్లు మంజూరు చేయవు. ఇలాంటి టైంలో మన ఫ్రెండ్స్, బంధువులు వచ్చి "ఏం కాదు, జస్ట్ ఒక సంతకం పెట్టు చాలు" అని అడుగుతుంటారు. కానీ, లోన్ తీసుకున్న వ్యక్తి కనుక అప్పు ఎగ్గొడితే ఆ డబ్బును హామీదారుడు కట్టాల్సిందేనా? అసలు ఆర్బీఐ రూల్స్, చట్టాలు దీనిపై ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

అప్పు ఎగ్గొడితే హామీదారుడు కట్టాల్సిందే..

హామీదారుడు అంటే ఏదో నామమాత్రంగా సంతకం పెట్టే వ్యక్తి కాదు, ఆ అప్పుకు పూర్తి బాధ్యత వహించే వ్యక్తి అని అర్థం. లోన్ తీసుకున్న వ్యక్తి ఈఎంఐలు కట్టడంలో విఫలమైనా, లేదా అసలు అప్పు ఎగ్గొట్టినా.. ఆ బాధ్యత నేరుగా గ్యారంటీర్‌పైనే పడుతుంది. ఆ డబ్బును మీ నుంచే వసూలు చేసే పూర్తి అధికారం బ్యాంకులకు ఉందని ఆర్బీఐ రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాదు, భారతీయ ఒప్పందాల చట్టం 1872లోని సెక్షన్ 128 ప్రకారం.. లోన్ తీసుకున్న వ్యక్తికి ఎంత బాధ్యత ఉంటుందో, హామీ సంతకం పెట్టిన మీకు కూడా సరిగ్గా అంతే బాధ్యత ఉంటుంది. అంటే, ఒకవేళ అసలు వ్యక్తి డబ్బులు కట్టకపోతే బ్యాంకులు నేరుగా మిమ్మల్ని డిమాండ్ చేసి, మీ నుంచి ఆ రుణాన్ని వసూలు చేస్తాయి.

మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.. భవిష్యత్తులో లోన్లు కష్టమే

ఒకరి లోన్‌కు గ్యారంటీర్‌గా ఉండటం వల్ల డబ్బులు కట్టే రిస్క్ మాత్రమే కాదు, మీ సొంత క్రెడిట్ రికార్డు కూడా దెబ్బతింటుంది. బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు రుణగ్రహీత వివరాలతో పాటు, హామీదారుడి వివరాలను కూడా క్రెడిట్ రికార్డుల్లో నమోదు చేస్తాయి. దీనివల్ల లోన్ తీసుకున్న వ్యక్తి ఈఎంఐ కట్టడంలో ఆలస్యం చేసినా, లేదా అప్పు ఎగ్గొట్టినా దాని ఎఫెక్ట్ నేరుగా మీ సిబిల్ స్కోర్‌పై పడుతుంది. మీ క్రెడిట్ రిపోర్టులో ఆ వివరాలు రికార్డ్ అయి ఉండటం వల్ల, భవిష్యత్తులో మీ అవసరాల కోసం ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులు నిరాకరించే ప్రమాదం ఉంది.

సంతకం పెట్టే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కేవలం బంధుత్వం, స్నేహం ఉందనే మొహమాటంతో ఎవరి లోన్‌కూ గుడ్డిగా గ్యారంటీ సంతకం పెట్టకండి. మీరు ఎవరికైనా హామీ ఉండాల్సి వస్తే, ముందుగా వారి నెలవారీ ఆదాయం ఎంత, ఉద్యోగ పరిస్థితి ఏంటి, వారికి అప్పటికే ఇంకేమైనా అప్పులు, ఈఎంఐలు ఉన్నాయా అనే విషయాలను పూర్తిగా చెక్ చేసుకోండి. సొంత కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులకు హామీ ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. తొందరపాటులో పెట్టే ఒక్క సంతకం మిమ్మల్ని జీవితాంతం ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుందని గుర్తుంచుకోండి.

#RBI Guidelines#Loan Guarantor Rules#Loan Guarantee#Guarantor Responsibility#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి