సినిమా

Kollywood: సాయి పల్లవి, శ్రీలీలకు O.M సక్సెస్ చాలా కీలకం..

4 నిమిషాల పఠనం

Kollywood: సినిమా ఇండస్ట్రీలలో మరీ ముఖ్యంగా సౌత్‌లో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి, శ్రీలీలకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక రేసులో బాగా వెనకబడ్డారు.

Kollywood: సినిమా ఇండస్ట్రీలలో మరీ ముఖ్యంగా సౌత్‌లో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి, శ్రీలీలకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక రేసులో బాగా వెనకబడ్డారు.

ఇద్దరికీ O.M సినిమా సక్సెస్ చాలా కీలకంగా మారిందా?

ఇటు సాఇ పల్లవి అటు శ్రీలీల..ఇద్దరూ కూడా తమ కెరీర్‌లో విభిన్నమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంటే, మరొకరు డ్యాన్స్, గ్లామర్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి, వీరిద్దరూ కలిసి నటిస్తున్న O.M సినిమాపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఇందులో, ధనుష్..మమ్ముట్టి హీరోలుగా నటించారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. హీరోలకంటే హీరోయిన్‌కి ఓం సినిమా హిట్ చాలా అవసరం.

"నిత్యారెడ్డి" సాయి పల్లవికి కొత్త ఇమేజ్ తెచ్చే పాత్ర!

సాయి పల్లవి ఇప్పటివరకు ఎమోషనల్, నేచురల్ పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలలో నటనకి మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే, అమరన్..మారి 2 లాంటి సినిమాలు. అయితే, ఇప్పుడు ధనుష్ నటించిన ‘ఓం’లో నిత్యారెడ్డి అనే ఐపీఎస్ అధికారిగా కనిపించబోతోంది.

ఏపీ క్యాడర్ పోలీస్ అధికారిగా మొదలై, సీబీఐలో కీలక బాధ్యతలు చేపట్టే పాత్రలో సాయి పల్లవి నటించింది. ముఖ్యంగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఆపరేషన్‌కు ఆమె నాయకత్వం వహించనుంది. దీంతో సాయి పల్లవికి ఇది కొత్త తరహా పాత్ర అని అర్థమవుతోంది. ఇటీవలే, రామాయణ సినిమాలో సీతగా నటించి ఆకట్టుకుంది. కానీ, ఆమె పర్ఫార్మెన్స్-కాస్ట్యూం పరంగా విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి, టైంలో వస్తున్న O.M సినిమా తన సక్సెస్‌కి చాలా కీలకంగా ఉంది.

శ్రీలీల మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలి:

తెలుగులో డాన్సింగ్ క్వీన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీలకి ఓం సినిమా హిట్ చాలా ముఖ్యం. ఈ మధ్య ఏ భాషలో ఎలాంటి సినిమా చేసినా పాపం ఫ్లాప్‌గా మిగులుతోంది. చేతిలో, ఒక్క తెలుగు సినిమా లేదు. గానీ, ఇతర భాషల్లో మాత్రం అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది. కానీ, హిట్స్ మాత్రం దక్కడం లేదు. మళ్ళీ, శ్రీలీల సక్సెస్ ట్రాక్ ఎక్కాలంటే ఓ తో పాటు వరుసగా మరో రెండు హిట్స్ చాలా ముఖ్యం.

#O.M Movie#Dhanush#Mammutty#Sai Pallavi#Sreeleela#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి