సినిమా

Varanasi: ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే.!

4 నిమిషాల పఠనం

Varanasi: మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఆయనకి జోడీగా శ్రుతి హాసన్ నటించినట్టుగా తెలుస్తోంది.

Varanasi: మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఆయనకి జోడీగా శ్రుతి హాసన్ నటించినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఈ మధ్య జక్కన్న బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, వారణాసి సినిమా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వారణాసి సినిమా అప్‌డేట్ ఇవ్వాలని.. ఓ అభిమాని మేకర్స్‌ను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశాడు. దీనికి, స్పందించిన వారణాసి అధికారిక ఖాతా అడ్మిన్.. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. అంతేకాదు, సీజీ వర్క్స్, రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, డబ్బింగ్ ఇంకా మొదలు పెట్టాల్సి ఉందని తెలిపాడు. అంతేకాదు, చివర్లో 'మీరు దీన్ని అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే.. లేదంటే బిగ్ సర్‌ప్రైజ్ కోసం ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి' అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న జక్కన్న బృందం!

దీంతో వారణాసి షూటింగ్ పూర్తయిన విషయంలో కన్‌ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం, రాజమౌళి అండ్ టీమ్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాంటి కీలక పనులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సీజీ వర్క్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం, సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకి డబ్బింగ్ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2027 ఏప్రిల్ 7న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

#Varanasi#Varanasi Updates#SS.Rajamouli#Mahesh Babu#Priyanka Chopra#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి