స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Intermediate  :  కాలేజీల్లో 9, 10 తరగతులు.. సర్కార్ కొత్తప్రతిపాదన?తెలంగాణSwechaa17 Nov 2026, 11:47 AM

Intermediate : కాలేజీల్లో 9, 10 తరగతులు.. సర్కార్ కొత్తప్రతిపాదన?

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డ్రపౌట్స్ తగ్గించేందుకు 10+2 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదిలాఉండగా, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేందుకే అని తాజాగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే ఇంటర్ బోర్డును విలీనం చేశారని.. 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించాలని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసిందని ప్రచారం జరుగుతోంది. పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డును విలీనం చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

హరీష్ కోటలో రేవంత్ రాజకీయ రణం.. సిద్దిపేటలో అసలైన సమరం!తెలంగాణSwechaa17 Nov 2026, 11:25 AM

హరీష్ కోటలో రేవంత్ రాజకీయ రణం.. సిద్దిపేటలో అసలైన సమరం!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ ఇలాఖా సిద్దిపేట రణరంగాన్ని తలపించనుందా..? ఈ నెల 19న సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏం జరగనుంది..? హామీలు అమలు చేశాకే సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టాలని హరీష్ ఎందుకంటున్నారు..? సీఎం పర్యటన సాఫీగానే సాగుతుందా..?

Viral: వారెవ్వా.. 40మంది బౌన్సర్ల మధ్య ‘గుర్రం’ గ్రాండ్ ఎంట్రీ!వైరల్ న్యూస్Swechaa17 Nov 2026, 11:21 AM

Viral: వారెవ్వా.. 40మంది బౌన్సర్ల మధ్య ‘గుర్రం’ గ్రాండ్ ఎంట్రీ!

 రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతరలో ఓ దృశ్యం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా దేశాధినేతలు, వీఐపీలు, అగ్ర సినీ తారలకు మాత్రమే కనిపించే భారీ బౌన్సర్ల భద్రతను, అక్కడ ఒక మేలుజాతి గుర్రానికి ఏర్పాటు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 'బాదల్' అనే అందమైన తెల్ల గుర్రం ఏకంగా 40మంది బౌన్సర్ల పటిష్ట భద్రతా వలయం మధ్య రాజసంగా మేళా ప్రాంగణంలోకి అడుగుపెట్టడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

Harish Rao : శూన్యహస్తంగా మారిన ‘అభయహస్తం’ :  హరీశ్ రావుతెలంగాణSwechaa17 Nov 2026, 11:16 AM

Harish Rao : శూన్యహస్తంగా మారిన ‘అభయహస్తం’ : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘అభయహస్తం’ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిందని, నేటికీ హామీల అమలు పూర్తి చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించుకున్న అభయహస్తం హామీలను అమలు చేయని మొండి హస్తంగా, శూన్య హస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల కిందట ఇదే రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి గుర్తుచేశారు.

custodial death : తెలంగాణలో మరో లాకప్ డెత్?క్రైమ్Swechaa17 Nov 2026, 10:37 AM

custodial death : తెలంగాణలో మరో లాకప్ డెత్?

వరంగల్ జిల్లాకు చెందిన వరుణ్ జడ్చర్లలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, వరుణ్ తాను పనిచేస్తున్న లాడ్జి నుంచి ఒక ల్యాప్‌టాప్, సుమారు రూ.32వేల నగదుతో పరారయ్యాడని లాడ్జి యజమాని శ్రీకాంత్ ఆదివారం ఉదయం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లాడ్జి యజమాని, సిబ్బంది గాలించగా అదే మధ్యాహ్నం బాలానగర్‌లో వరుణ్ దొరికాడు. వెంటనే అతడిని తీసుకొచ్చి జడ్చర్ల పోలీసులకు అప్పగించారు. అయితే పీఎస్‌లో ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైన వరుణ్.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.

KonaseemaGasLeak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం!ఏపీSwechaa17 Nov 2026, 10:32 AM

KonaseemaGasLeak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం!

 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ (ONGC) సీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్ నుంచి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ ఎత్తున గ్యాస్ లీకైంది. భూమి కంపించినట్లుగా భారీ శబ్దాలతో గ్యాస్ ఎగసిపడటంతో నగరం, గెద్దాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఊరంతా దట్టంగా గ్యాస్ వాసన వ్యాపించడంతో ఏ క్షణాన ఏ పెను ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు.

Aarogyasri:  పేరుకుపోతున్న ఆరోగ్యశ్రీ బకాయిలు.. సర్జరీలు బంద్!తెలంగాణSwechaa17 Nov 2026, 10:09 AM

Aarogyasri: పేరుకుపోతున్న ఆరోగ్యశ్రీ బకాయిలు.. సర్జరీలు బంద్!

తెలంగాణలో దయనీయ పరిస్థితుల్లో వైద్యవ్యవస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ బకాయిలు పేరుకుపోతున్నట్టు తెలిసింది. నిధులు లేక ఆస్పత్రి నిర్వాహణ కష్టతరంగా మారుతోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో సుమారు రూ.800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, రెగ్యులర్‌గా వచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఇప్పటికే సర్జరీలు బంద్ చేసినట్టు తెలుస్తోంది.ప్రభుత్వం పట్టించుకోక, సమయానికి నిధులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణకు సూపరింటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ నిధులతో పాటు, రెగ్యులర్‌గా రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని సూపరింటెండెంట్లు వెల్లడించారు. తెలంగాణ వైద్య విద్య సంచాలకుల పరిధిలోని 35 బోధనాస్పత్రులు, మరో 12 ప్రభుత్వ ఆసుపత్రులు, టీవీవీపీ పరిధిలోని 180కి పైగా ఆసుపత్రుల్లో మూడేళ్లుగా ఆరోగ్య శ్రీ నిధులు రాలేదని,ఫలితంగా శస్త్రచికిత్సలు నిలిపివేసినట్టు సమాచారం.

ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa17 Nov 2026, 09:56 AM

ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 ప్రభుత్వ అధికారుల పనితీరు, అవినీతిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అత్యంత అవినీతిపరులుగా మారారని ఆయన బహిరంగంగా ఆరోపించారు. కొంతమంది అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వల్లే తమ ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు వస్తోందని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను ఆయన నేరుగా ఎండగట్టడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Sajjanar IPS : 30 ఏండ్ల ఐపీఎస్ అధికారి..  మూడు రోజులుగా అరెస్ట్ చేయాలని ముప్పుతిప్పలు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa17 Nov 2026, 09:52 AM

Sajjanar IPS : 30 ఏండ్ల ఐపీఎస్ అధికారి.. మూడు రోజులుగా అరెస్ట్ చేయాలని ముప్పుతిప్పలు?

‘దిశ’ ఎన్‌కౌంటర్ అంటే పేరొచ్చింది మీకే. మిమ్మల్ని హీరో చేసింది జర్నలిస్టులే. వరంగల్ యాసిడ్ దాడి సమయంలో దగ్గర ఉండి ఆనాడు రిపోర్ట్ చేసిన రిపోర్టర్ దొంతి రమేష్‌ను రాత్రికి రాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి చూపించారు. ఇలా అనేక మందిని మీరు సీపీగా రిమాండ్‌కు తరలించి జైల్లో పెట్టాలని చూశారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినా ఊచలు లెక్కబెట్టించలేకపోయారు. కానీ రోజురోజుకూ డబ్బుల కోసం దిగజారిపోయిన తీరును తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మీకు పేరు, ప్రతిష్ట కావాలి. అపవాదు రాకుండా జాగ్రత్త పడతారు. అదే విధంగా అన్ని పదవులు అనుభవించాలనే ఆశ. దిశ ఎన్‌కౌంటర్ ఫేక్ అని జస్టిస్ సర్పఖర్ ధర్మాసనం తేల్చింది.

Today in History: చరిత్రలో ఈ రోజు (17 నవంబర్)InternationalSwechaa17 Nov 2026, 09:20 AM

Today in History: చరిత్రలో ఈ రోజు (17 నవంబర్)

  • 1928: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ లాఠీచార్జీలో గాయపడి దేశం కోసం ప్రాణాలర్పించారు.

  • 1966: భారతీయ అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో కేరళలోని తుంబా నుంచి మొదటి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

  • 1869: ఈజిప్టులో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ ప్రపంచ ప్రఖ్యాత 'సూయజ్ కాలువ' (Suez Canal) అధికారికంగా నౌకాప్రయాణానికి ప్రారంభించబడింది.

  • 1970: సోవియట్ యూనియన్ మానవరహిత అంతరిక్ష యాత్రలో భాగంగా చంద్రునిపైకి పంపిన 'లూనోఖోడ్ 1' రోవర్ చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయి అన్వేషణ ప్రారంభించింది.

  • 1997: ఈజిప్టులోని లక్సూర్ నగరంలో ఉగ్రవాదులు జరిపిన జాతీయ దాడిలో 62 మంది పర్యాటకులు మరణించారు (లక్సూర్ ఊచ*కోత).

  • 2019: చైనా తన తొలి స్వదేశీ విమాన వాహక నౌక 'షాన్‌డాంగ్' (Shandong - Type 002) ను తైవాన్ జలసంధిలో విజయవంతంగా పరీక్షించింది.

  • 1917 (మరణం): ఇందిరా దేవి / రాణి లక్ష్మీబాయి కాలం నాటి ప్రముఖులు / షీలా దీక్షిత్ (జననం 1938) — ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు.

  • 1928 (జననం): చార్సన్ హేటన్ లేదా ప్రముఖ శాస్త్రవేత్తలు.

  • 2012 (మరణం): బాల్ థాకరే — శివసేన వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడు.

నేటి పంచాంగం - 17 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ అష్టమి (గోపాష్టమి)SpiritualitySwechaa17 Nov 2026, 09:04 AM

నేటి పంచాంగం - 17 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ అష్టమి (గోపాష్టమి)

  • తేదీ: 17 నవంబరు 2026, మంగళవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: అష్టమి (తెల్లవారుజామున 04:30 వరకు, తదుపరి నవమి)

  • వారం: మంగళవారం (భౌమవాసరే)

  • నక్షత్రం: శతభిషం (తెల్లవారుజామున 04:12 వరకు, తదుపరి పూర్వాభాద్ర)

  • యోగం: ధ్రువ (మధ్యాహ్నం 02:22 వరకు, తదుపరి వ్యాఘాత)

  • కరణం: భద్ర/విష్టి (ఉదయం 05:40 వరకు), తదుపరి బవ (సాయంత్రం 04:50 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • యమగండం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • అమృతకాలం: ఉదయం 11:15 - 12:48 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 08:37 - 09:23 వరకు మరియు రాత్రి 10:46 - 11:35 వరకు

  • వర్జ్యం: రాత్రి 02:10 - 03:45 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: వృశ్చికం

  • చంద్రరాశి: కుంభం

  • సూర్యోదయం: ఉదయం 06:26

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36

ఈ తుఫానైనా వర్షాలు కురిపిస్తుందా..? అక్వాన్ పై తెలంగాణ ఆశలు!తెలంగాణSwechaa17 Nov 2026, 12:38 AM

ఈ తుఫానైనా వర్షాలు కురిపిస్తుందా..? అక్వాన్ పై తెలంగాణ ఆశలు!

అక్వాన్ తుఫాన్ తెలంగాణపై ఏ మేరకు ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ పేరు వింటేనే ఏపీ వణికిపోతోంది. తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలంగాణ మాత్రం.. ఈ తుఫానైనా వానలు కురిపిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తోంది.

తెలంగాణలో ఇంటర్ విద్యకు గుడ్ బై..! ఇది లాభమా.. నష్టమా?తెలంగాణSwechaa16 Nov 2026, 11:55 PM

తెలంగాణలో ఇంటర్ విద్యకు గుడ్ బై..! ఇది లాభమా.. నష్టమా?

ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ పై పెను ప్రభావమే చూపుతోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అమలవుతున్న ఇంటర్మీడియెట్ విధానాన్ని పూర్తిగా తీసేసి.. 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది లాభమా.. నష్టమా..?

PM Fasal Bima Yojana: ఎల్‌నినోతో పంటనష్టపోయారా.. వాట్సాప్‌లోనే సింపుల్‌ గా అప్లై చేసుకోండి..తెలంగాణSwechaa16 Nov 2026, 09:57 PM

PM Fasal Bima Yojana: ఎల్‌నినోతో పంటనష్టపోయారా.. వాట్సాప్‌లోనే సింపుల్‌ గా అప్లై చేసుకోండి..

PM Fasal Bima Yojana: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, తుఫాన్లు, చీడపురుగుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, చాలామంది రైతులకు పంట నష్టపోయాక ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కేవలం తమ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే నిమిషాల్లో పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునే అద్భుతమైన సౌకర్యం ఉందన్న విషయం తెలియదు.పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం, రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటలకు బీమా రక్షణ కల్పిస్తోంది. తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, కరువు, భూకంపాలు, చీడపురుగులు లేదా జంతువుల దాడి వల్ల పంట దెబ్బతింటే ఈ స్కీమ్ కింద వెంటనే నష్టపరిహారం అందుతుంది.

RBI Guidelines: లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే.. హామీదారుడు కట్టాలా? రూల్స్ ఏం చెప్తున్నాయ్?NationalSwechaa16 Nov 2026, 09:49 PM

RBI Guidelines: లోన్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే.. హామీదారుడు కట్టాలా? రూల్స్ ఏం చెప్తున్నాయ్?

RBI Guidelines: హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్.. ఇలా ఏ రుణం తీసుకోవాలన్నా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు కచ్చితంగా హామీదారుడు సంతకం, ఆధార్ వివరాలు అడుగుతాయి. ఎవరో ఒకరు ష్యూరిటీ సంతకం పెట్టకపోతే సాధారణంగా బ్యాంకులు లోన్లు మంజూరు చేయవు. ఇలాంటి టైంలో మన ఫ్రెండ్స్, బంధువులు వచ్చి "ఏం కాదు, జస్ట్ ఒక సంతకం పెట్టు చాలు" అని అడుగుతుంటారు. కానీ, లోన్ తీసుకున్న వ్యక్తి కనుక అప్పు ఎగ్గొడితే ఆ డబ్బును హామీదారుడు కట్టాల్సిందేనా? అసలు ఆర్బీఐ రూల్స్, చట్టాలు దీనిపై ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

Kollywood: సాయి పల్లవి, శ్రీలీలకు O.M సక్సెస్ చాలా కీలకం..సినిమాSwechaa16 Nov 2026, 09:46 PM

Kollywood: సాయి పల్లవి, శ్రీలీలకు O.M సక్సెస్ చాలా కీలకం..

Kollywood: సినిమా ఇండస్ట్రీలలో మరీ ముఖ్యంగా సౌత్‌లో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి, శ్రీలీలకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక రేసులో బాగా వెనకబడ్డారు.

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాంతెలంగాణSwechaa16 Nov 2026, 09:00 PM

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం

Jupally Krishna Rao: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పేదల సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కొల్లాపూర్ పట్టణంలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు మంత్రి జూపల్లి.

సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

TG: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశం!తెలంగాణSwechaa16 Nov 2026, 08:58 PM

TG: తెలంగాణలో 7 లక్షల కుటుంబాలకు శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశం!

TG: తెలంగాణలోని సుమారు 7 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని, తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా పెట్టిన లబ్ధిదారులకు వాటిని తిరిగి ఇచ్చేయాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా నేరుగా ప్రయోజనం కలగనుందని ఆయన వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల ద్వారా నిధులు అందించేవారు. అయితే, బ్యాంకు రుణాల కోసం అప్పట్లో లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వ వద్ద తనఖా పెట్టాల్సి వచ్చింది. రూల్స్ ప్రకారం రుణ వాయిదాలన్నీ కట్టేసిన తర్వాత ఆ పట్టాలను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి. కానీ, వివిధ కారణాల వల్ల లక్షలాది మందికి చెందిన ఆ విలువైన పత్రాలు ఇప్పటికీ తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.

ఇంటర్ బోర్డు రద్దుతో స్టూడెంట్లకు ఒరిగేదేంటి.. ఆ ఫీజుల దోపిడీ సంగతేంటి?తెలంగాణSwechaa16 Nov 2026, 08:08 PM

ఇంటర్ బోర్డు రద్దుతో స్టూడెంట్లకు ఒరిగేదేంటి.. ఆ ఫీజుల దోపిడీ సంగతేంటి?

Telangana Politics: తెలంగాణలో 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేస్తూ 10+2 విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం మొదలైంది. "ఇక శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీల మాఫియాకు చెక్ పడినట్లే.. లక్షల రూపాయల ఫీజుల దోపిడీ ఆగిపోయినట్లే.. రేవంత్ రెడ్డి తోపు, తురుము" అంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కానీ, అసలు గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం సీన్ వేరేలా కనిపిస్తోంది. కేవలం బోర్డును ఎత్తేసి 10+2 తీసుకొచ్చినంత మాత్రాన ఆ ఫీజుల దోపిడీ నిజంగా ఆగుతుందా? దీనివల్ల సామాన్య తల్లిదండ్రులకు ఒరిగేదేంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Harish Rao: ఏ ముఖం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నారు- సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్ రావుSwechaa16 Nov 2026, 07:29 PM

Harish Rao: ఏ ముఖం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నారు- సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన హరీశ్ రావు

Harish Rao: ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏ ముఖం పెట్టుకుని సిద్ధిపేటకు వస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్ రెడ్డి మార్చి 22, 2026 నాడు సిద్ధిపేటకు వచ్చారని.. ఆరోజు మీటింగ్ లో 45 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు వేస్తామని రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 230 రోజులు అవుతున్నా.. ఈ రోజుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పినందుకు ఈరోజు రాష్ట్రానికి అరిష్టం కలిగిందన్నారు హరీశ్ రావు. రేవంత్ పాపం వల్లనే రాష్ట్రానికి కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. మే 2, 2024 నాడు మొదటిసారి రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు వచ్చినప్పుడు కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారని.. ఇప్పటికీ మూడు పంద్రాగస్టులు పోయాయి.. కానీ రైతు రుణమాఫీ కాని పరిస్థితి ఉందని వాపోయారు. సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు.

TG: హైదరాబాద్‌లో నీటి కొరత లేదంట.. ఉత్తమ్‌ కుమార్‌పై దారుణమైన ట్రోల్స్తెలంగాణSwechaa16 Nov 2026, 06:37 PM

TG: హైదరాబాద్‌లో నీటి కొరత లేదంట.. ఉత్తమ్‌ కుమార్‌పై దారుణమైన ట్రోల్స్

TG: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, హైదరాబాద్ నగరంలో ఎలాంటి నీటి కొరత లేదని పేర్కొన్నారు. అయితే, నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు నగరంలో నీటి కొరత లేదని చెబుతుంటే, మరోవైపు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Varanasi: ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే.!సినిమాSwechaa16 Nov 2026, 06:36 PM

Varanasi: ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే.!

Varanasi: మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఆయనకి జోడీగా శ్రుతి హాసన్ నటించినట్టుగా తెలుస్తోంది.

2014కు ముందు ఇళ్ల పథకం లబ్దిదారులకు భారీ ఊరటSwechaa16 Nov 2026, 06:31 PM

2014కు ముందు ఇళ్ల పథకం లబ్దిదారులకు భారీ ఊరట

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014కు ముందు ఇళ్ల పథకం లబ్దిదారులకు భారీ ఊరట కల్పించింది. ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్ల తిరిగి ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. తహశీల్దార్ ఆఫీసుల్లో ఉన్న ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు తిరిగివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. 22ఏ భూముల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. ఈ పట్టాల కోసం లబ్దిదారులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ప్రభుత్వం తెరదించింది.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. 17 ఏళ్ల జైలు తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్!NationalSwechaa16 Nov 2026, 06:16 PM

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. 17 ఏళ్ల జైలు తర్వాత ఇద్దరు దోషులకు బెయిల్!

Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దాదాపు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్‌లకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారిని తక్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.2017లో బాంబే హైకోర్టు తమకు విధించిన జీవితఖైదును సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలంతెలంగాణSwechaa16 Nov 2026, 05:58 PM

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాల కలకలం

ACB Raids: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. లంచం తీసుకుంటూ రెండు నెలల క్రితం ప్లానింగ్ ఆఫీసర్ వాణి పట్టుబడ్డారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణలో కీలక విషయాలు రాబట్టారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో గుండు వాణి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వాణికి చెందిన స్థిర, చరాస్తులపై ఆరా తీశారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు.

Tollywood: క్లారిటీ లేని వెంకీ లైనప్..ఆ తర్వాతేంటీ?సినిమాSwechaa16 Nov 2026, 05:50 PM

Tollywood: క్లారిటీ లేని వెంకీ లైనప్..ఆ తర్వాతేంటీ?

Tollywood: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల లైనప్ లో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత గందరగోళం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటీ..ఎవరితో కమిటైయ్యాడు అని. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇది బావుంది కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో, ఒక సినిమా సెట్స్‌పైన ఉండగానే మరో ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ఇప్పుడు ఉండటం లేదు.

Tollywood: చాలా ఏళ్ళకి మళ్ళీ తెలుగు తెరపై బాలన్!సినిమాSwechaa16 Nov 2026, 05:31 PM

Tollywood: చాలా ఏళ్ళకి మళ్ళీ తెలుగు తెరపై బాలన్!

Tollywood: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తికరంగా మారింది. గతంలో, ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్యకు జోడీగా బసవతారకం పాత్రలో నటించిన విద్యా బాలన్.. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో విద్యాబాలన్ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు.

Allu Arjun: మరీ ఇంత డబ్బా అవసరమా బన్నీ? అబ్దుల్ కలాం, సచిన్‌లతో పోలికపై అల్లు అర్జున్‌పై ట్రోల్స్!సినిమాSwechaa16 Nov 2026, 05:07 PM

Allu Arjun: మరీ ఇంత డబ్బా అవసరమా బన్నీ? అబ్దుల్ కలాం, సచిన్‌లతో పోలికపై అల్లు అర్జున్‌పై ట్రోల్స్!

Allu Arjun: సినిమా ఈవెంట్లలో హీరోలకు యాంకర్లు ఎలివేషన్లు ఇవ్వడం చాలా కామన్. కానీ ఆ పొగడ్తలు హద్దులు దాటి, ఏకంగా దేశం గర్వించే మహనీయులతో పోల్చే స్థాయికి వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన బన్నీ, యాంకర్ సుమతో కొట్టించుకున్న డబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ అల్లు అర్జున్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "రామేశ్వరంలో ఓ కుర్రాడు కల కన్నాడు.. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. ముంబై వీధుల్లో ఓ కుర్రాడు కల కన్నాడు.. అతనే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్.

Iran Crisis: అవయవాలు అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు.. కనికరం లేదా ట్రంప్?NationalSwechaa16 Nov 2026, 04:17 PM

Iran Crisis: అవయవాలు అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు.. కనికరం లేదా ట్రంప్?

Iran Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కఠిన ఆంక్షలు, యుద్ధ వాతావరణం ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. అగ్రరాజ్యం అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. పాలకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుకు సామాన్య ప్రజలు నిలువునా బలవుతున్నారు. చివరికి పూట గడవక, పెరిగిపోయిన అప్పులు తీర్చుకోలేక ఇరాన్ ప్రజలు సొంత శరీర భాగాలనే అమ్ముకునే దుస్థితికి దిగజారారు. కిడ్నీలు, కాలేయ కణజాలం, ఎముక మజ్జ, చివరికి వృషణాలను సైతం అమ్మకానికి పెడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ఇరాన్ వార్తా సంస్థ 'ఇల్నా' ఈ కన్నీటి గాథలను బయటపెట్టింది.

NTR-Anil: ‘దాన వీర శూర’గా ఎన్టీఆర్!సినిమాSwechaa16 Nov 2026, 03:52 PM

NTR-Anil: ‘దాన వీర శూర’గా ఎన్టీఆర్!

NTR-Anil: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కన్‌ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు ‘దాన వీర శూర’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.