సినిమా

Tollywood: చాలా ఏళ్ళకి మళ్ళీ తెలుగు తెరపై బాలన్!

4 నిమిషాల పఠనం

Tollywood: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ సీనియర్ నటి విద్యా బాలన్ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తికరంగా మారింది. గతంలో, ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్యకు జోడీగా బసవతారకం పాత్రలో నటించిన విద్యా బాలన్.. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో విద్యాబాలన్ తెలుగులో ఇంకో సినిమా చేయలేదు.

మళ్ళీ ఇన్నేళ్ళకి మరోసారి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అయితే, ఈసారి ఆమె హీరోయిన్‌గా కాకుండా కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ పాత్ర నిడివి ఎంత..అది నెగిటివ్ రోలా లేక పాజిటివ్ రోలా అన్నది మేకర్స్ నుంచి వచ్చే కన్‌ఫర్మేషన్ తోనే తెలుస్తుంది.

కొరటాల సినిమాలో బాలన్‌కి పవర్‌ఫుల్ రోల్!

బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్‌బికే 112 సెట్స్ మీదకి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విద్యా బాలన్‌ను ఓ ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా, ఆమె పాత్రకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.

సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో విద్యా బాలన్ పాత్ర ఎంటరవుతుంది. ఇది చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా, బాలయ్య పాత్రకు సంబంధించిన గతాన్ని రివీల్ చేసే క్రమంలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి, దీనికి సంబందించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న దాదా చిత్రం ఈ డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

#NBK112#Balakrishna#Vidya Balan#Korata Siva#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి