NTR-Anil: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కన్‌ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు ‘దాన వీర శూర’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
నిజంగానే ‘దాన వీర శూర’ టైటిల్‌ను గనక పరిశీలిస్తుంటే..ఖచ్చితంగా హైప్ బాగా పెరుగుతుంది. తాత నందమూరి తారకరామారావు టైటిల్ సెంటిమెంట్‌ను మనవడు రిపీట్ చేయబోతున్నాడా? అనే చర్చ ఇప్పుడు, టాలీవుడ్‌లో మొదలైంది. నందమూరి తారకరామారావు నటించిన ‘దాన వీర శూర కర్ణ’ తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా చూపించిన నటవిశ్వరూపం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. అలాంటి, చారిత్రక నేపథ్యం ఉన్న టైటిల్‌లోని పదాలను మనవడి సినిమా కోసం పెట్టాలనుకోవడం నందమూరి అభిమానులకు అది మరింత ప్రత్యేకంగా ఉంటుంది.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందా?
హిట్ మిషన్ అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు విపరీతంగా ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే. మరోవైపు, ఎన్టీఆర్‌కు మాస్ ఇమేజ్‌తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఈ రెండు అంశాలను కలిపి అనిల్ ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ప్రకటన వచ్చినప్పటి నుంచి చాలా ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా, స్వయంగా ఎన్టీఆర్ ఈ సినిమాను ఒక లాఫ్ రైట్‌గా అభివర్ణించడం చూస్తుంటే, ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా ఏ రేంజ్‌లో కామెడీతో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. 2027 సంక్రాంతికి జనవరి 12 విడుదల అంటూ మల్టీస్టారర్ మూవీతో రాబోతున్నాడు అనిల్. ఈ సినిమాను కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొదిస్తున్నాడు. కాబట్టి, ఎన్టీఆర్ సినిమాను అదుర్స్ సినిమాను మించి కామెడీ కంటెంట్‌తో ప్రజెంట్ చేయడం గ్యారెంటీ. మరి, అధికారికంగా, ఈ సినిమా టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.


