Allu Arjun: సినిమా ఈవెంట్లలో హీరోలకు యాంకర్లు ఎలివేషన్లు ఇవ్వడం చాలా కామన్. కానీ ఆ పొగడ్తలు హద్దులు దాటి, ఏకంగా దేశం గర్వించే మహనీయులతో పోల్చే స్థాయికి వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు సరిగ్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో అదే జరిగింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన బన్నీ, యాంకర్ సుమతో కొట్టించుకున్న డబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు స్టేజ్ మీద ఏం జరిగింది?
ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ అల్లు అర్జున్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "రామేశ్వరంలో ఓ కుర్రాడు కల కన్నాడు.. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. ముంబై వీధుల్లో ఓ కుర్రాడు కల కన్నాడు.. అతనే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఒక బస్ కండక్టర్ కల కన్నాడు.. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక కానిస్టేబుల్ కొడుకు కల కన్నాడు.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. అలాగే నేషనల్ అవార్డ్ గెలవాలని ఓ కుర్రాడు కల కన్నాడు.. తన కలతో పాటు ఫ్యాన్స్ కలల్ని కూడా నిజం చేశాడు.. అతనే అల్లు అర్జున్" అంటూ సుమ భారీ ఎలివేషన్ ఇచ్చింది.
నెటిజన్ల ఫైర్.. మరీ టూ మచ్ అంటున్న జనం!
సుమ ఇచ్చిన ఈ ఎలివేషన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. బన్నీని డైరెక్ట్‌గా పొగడాలనుకుంటే పొగడాలి తప్ప, మరీ అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలతో పోల్చడం ఏంటని జనం మండిపడుతున్నారు. మాస్ సినిమా రైటర్స్ కూడా ఇంత ఓవర్ ఎలివేషన్ రాయలేరేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా అల్లు అర్జున్ కావాలనే తన పీఆర్ టీమ్‌తో, సుమతో ప్లాన్ చేయించి కొట్టించుకున్న డబ్బాలా ఉందని విమర్శలు వస్తున్నాయి.
ప్యాన్ ఇండియా స్టార్‌కి ఈ పబ్లిసిటీ స్టంట్లు అవసరమా?
నిజానికి అల్లు అర్జున్ ఇప్పటికే ప్యాన్ ఇండియా స్టార్. నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు, ఫేమ్ ఉన్నాయి. అలాంటి స్టార్ హీరో.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోలా ఇలా స్టేజ్‌ల మీద ప్రత్యేకంగా డబ్బా కొట్టించుకోవడం అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పక్కన హీరో దుల్కర్ సల్మాన్ సినిమా ఈవెంట్‌కు వచ్చి, ఆ సినిమా గురించి కాకుండా తన గురించి తానే గొప్పగా పొగిడించుకోవడం అస్సలు బాగోలేదని సినీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క స్పీచ్ దెబ్బకు బన్నీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.


